27.7 C
Hyderabad
April 26, 2024 03: 50 AM
Slider నిజామాబాద్

చట్టాలపై అవగాహనకలిగి ఉంటే సత్వర న్యాయం దక్కుతుంది

#kamareddy

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. అజాదీకా అమృత్  మహాత్సవ్  భాగంగా జాతీయ, స్టేట్, జిల్లా లీగల్ సర్విస్ అథారిటీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న మున్సిఫ్ కోర్ట్ న్యాయమూర్తి అనిత మాట్లాడుతూ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.

న్యాయలపైన, చట్టలపైన అవగాహన కలిగివుండడం వల్ల సత్వర న్యాయం పొందవచ్చునని అన్నారు. వృద్ధుల వారి కుటుంబ సభ్యలు వదిలేయడం సారి కాదని అన్నారు. చిన్న పిల్లలను వారికి నచ్చే విధంగా పెరగనివ్వాల్ని, వారిపై మానసిక వత్తిడి తీసుకురావద్దని ఆమె అన్నారు.

మానసిక ఒత్తిడి వల్ల చాలా మంది ఎన్నోరకాల బాధలకు గురి అవుతున్నారని ఆమె అన్నారు. అందుకు మండలాల్లో న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫ్యాన్ ఇండియా ఆవేర్నేస్  కార్యక్రమాలు కళ బృందలతో నిర్వహిస్తూ ఈ నెల అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు నల్సార్ లీగల్ సర్విస్ వాక్  కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి  జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్, ఎల్లారెడ్డి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ జగ్జివన్, ఎల్లారెడ్డి బార్ అధ్యక్షుడు నామ శ్రీనివాస్, ఏజిపి గోపాల్ రావు, నామ శ్రీకాంత్, పద్మ పండరీ, ఎల్లారెడ్డి సీఐ రాజ్ శేఖర్ ఎస్ ఐ  మధుసూదన్ రెడ్డి, ఆప్కారీ ఎస్ ఐ రమేష్, పలు మండలాల  సీనియర్ సిటిజన్,కోర్ట్ సిబ్బంది,ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

విక్రమ సింహపురి యూనివర్సిటీలో గాంధీ వర్ధంతి

Satyam NEWS

సీబీఐ కే షాక్ ఇస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

నివర్ తుపాను తో నష్టపోయిన రోడ్లకు మార్చిలోపు మరమ్మతులు

Satyam NEWS

Leave a Comment