32.2 C
Hyderabad
March 28, 2024 23: 32 PM
Slider గుంటూరు

లాక్ డౌన్ ఆంక్షలు పాటించకుంటే కేసులు నమోదు

DSP Veerareddy

గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో పాజిటివ్ కేసు వచ్చి ఓ వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే. సదరు వ్యక్తి నివాస ప్రాంతం, విధులు నిర్వహించిన ప్రాంతాలను రెడ్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చారు. ఆ ఏరియా మొత్తం బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టడి చేశారు.

వరవకట్ట, రామిరెడ్డి పేట, పల్నాడురోడ్డు ప్రాంతాలను రెడ్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చిన నేపథ్యంలో పోలీస్ ఆంక్షలను పాటించకుండా ప్రజలు ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వీరారెడ్డి తెలిపారు. ఎపిడమిక్ డీసీజ్ 1897 యాక్ట్ ను అమలు చేస్తామని చెప్పారు.

పోలీసులు వీరిని కొట్టకుండా డైరెక్టుగా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని ఆ కేసు తీవ్రత ఇప్పుడు మీకు తెలియదని తర్వాత సంవత్సరాల తరబడి శిక్షలు పడతాయని డీఎస్పీ వీరారెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం రెడ్ జోన్ ప్రాంతాలను పరిశీలించారు. దయచేసి ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించి బయటకు రాకుండా మీ ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు.

Related posts

తెలంగాణ సూఫీ తాత్వికతకు ప్రతిష్టాత్మక అవార్డు

Satyam NEWS

మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంట్లో దొరికింది ఎంతో తెలుసా?

Satyam NEWS

ఢీ అంటే ఢీ: రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్

Satyam NEWS

Leave a Comment