ఈ నెల 24న దేశవ్యాప్తంగా జరుగు స్కీమ్ వర్కర్ల సమ్మెను విజయవంతం చేయుటకు అంగన్వాడీ,ఆశ,మధ్యాహ్న భోజన,ఐకెపి,వివో ఏ,కస్తూర్బా,చైల్డ్ లేబర్, మెడికల్ అండ్ హెల్త్,విద్యా కేంద్రం తదితర స్కీమ్ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో స్కీమ్ వర్కర్ల కార్మికులకి దేశ వ్యాప్తంగా జరుగు సమ్మె కరపత్రాలు పంచుతూ రోషపతి మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సమయంలో దేశంలో కీలక పాత్ర పోషించి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పని చేసిన స్కీమ్ వర్కర్లని ఆదుకోవటంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు.
కరోనా కాలంలో 50 లక్షలు ఇన్సూరెన్స్ చేస్తానని మాటలకే బిజెపి ప్రభుత్వం పరిమితం అయిందని, ఆచరణ చేయలేదని అన్నారు. తక్షణం కనీస వేతనం నెలకి 21000 రూపాయలు ఇవ్వాలని,లేదా అందరిని పర్మినెంట్ చేయాలని, స్కూల్స్ బంద్ సమయంలో మధ్యాహ్నం భోజన కార్మికులకు ప్రతి ఒక్కరికి 10 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థికంగా అందజేయాలని,4 లేబర్ కోడలు కార్మిక చట్టాల సవరణ రద్దు చేయాలని అన్నారు.
ప్రతి వ్యక్తి నెలకి 10 కిలోల సన్న బియ్యం పంపిణీ చేయాలని,అధిక ధరలని నియంత్రించాలని,ప్రతి పేద కుటుంబానికి నెలకి 7,500 చెల్లించాలని,రేషన్ కార్డు మీద అన్ని నిత్యావసర సరుకులు అందించి,తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్లతో జరిగే సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పూర్తిగా పనులు బందు చేసి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు మనీ కుమారి,వెంకన్న, కోటమ్మ,సైదులు,శేఖర్,శ్రీదేవి,వాణి, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్