37.2 C
Hyderabad
March 29, 2024 20: 47 PM
Slider ఖమ్మం

దివ్యాంగులు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయాలి

#collector

దివ్యాంగులు ఆత్మ న్యూనతా భావాన్ని పక్కనపెట్టి ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏమీ లేదని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో చేపట్టిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగులు వికలాంగులమనే భావనను మనసులో నుండి తీసివేయాలన్నారు. పట్టుదల, ప్రతిభ ఉన్నప్పుడే సమాజంలో రాణిస్తారని,ఎందరో దివ్యాంగులు తమ ప్రతిభతో అనేక రంగాల్లో రాణించారు అన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. జిల్లాలో 29 వేల మంది దివ్యాంగులకు ఆసరా పెన్షన్ క్రింద రూ. 3,016 అందిస్తున్నామన్నారు. ట్రై సైకిల్, దివ్యాంగులకు అవసరమైన వీల్ చైర్లు చేతి కర్రలు త్రీ వీలర్ స్కూటీ లను అందిస్తున్నామన్నారు. డబుల్ బెడ్ రూమ్ పథకంలో 5 శాతం ప్రత్యేక కోటా కల్పించడం జరుగుతుందన్నారు. డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ లోనే కేటాయిస్తామన్నారు. 

ప్రపంచ దివ్యంగుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని, స్త్రీ- శిశు సంక్షేమ శాఖలో భాగంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ సంక్షేమ శాఖ విభాగాన్ని ప్రత్యేక శాఖగా దివ్యాంగుల సాధికారత శాఖగా ప్రభుత్వం ఏర్పాటుకు ఆదేశాలు జారీచేసిందన్నారు. దివ్యాంగుల బ్యాక్ లాగ్ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని పథకాలలో 5 శాతం దివ్యాంగులకు కేటాయించడం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టర్ కేక్ కట్  చేశారు. దివ్యాంగుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఉపాధిహామీ దివ్యాంగ కూలీలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి సంధ్యారాణి, డిఆర్డీఓ విద్యాచందన, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి డా. మాలతి, దివ్యాంగుల సంఘం బాధ్యులు ఉప్పలయ్య, సురేష్, నాగరాజు, పెద్ద సంఖ్యలో దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

Sub Editor

మంత్రి కేటీఆర్ ఫామ్ హౌస్ వద్ద రేవంత్ రెడ్డి అరెస్టు

Satyam NEWS

ప్రతిభ చూపిన విద్యార్ధులకు పోలీసుల సన్మానం

Satyam NEWS

Leave a Comment