40.2 C
Hyderabad
April 19, 2024 16: 33 PM
Slider నల్గొండ

మేడే అమరవీరుల స్ఫూర్తితో ప్రజా పోరాటాలు నిర్వహించాలి: సిపిఎం

#cpm

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండలం కరక్కాయల గూడెం గ్రామంలో సిపిఎం ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం సందర్భంగా సిపిఎం  సీనియర్ నాయకుడు చింతకుంట్ల వీరయ్య జండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి హాజరై మాట్లాడుతూ అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు ఎనిమిది గంటల పని విధానం,శ్రమ దోపిడిపై పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి సాధించుకున్న రోజు మే ఒకటో తారీకున ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుకోవాడం జరిగిందని అన్నారు.

భారతదేశంలో బిజెపి అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు అవుతున్నా కార్మిక చట్టాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉన్నాయని పల్లె వెంకటరెడ్డి విమర్శించారు.ఢిల్లీలో రైతులు 11 నెలల పాటు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి విజయం సాధించిన విషయం గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక, ప్రజా,వ్యతిరేక విధానాలపై రానున్న కాలంలో ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు,మూడు ఎకరాల భూ పంపిణీ, సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హుజూర్ నగర్ మండలంలో పేదలకు ఇళ్ల స్థలాలు,పింఛన్లు,ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలని అన్నారు. రానున్న కాలంలో సిపిఎం ఆధ్వర్యాన మండల వ్యాప్తంగా ప్రజలను సమీకరించి స్థానిక సమస్యలపై పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వటైపు సైదులు,దుర్గి బ్రహ్మం,సిపిఎం మండల కార్యదర్శి పోసన బోయిన హుస్సేన్,సిపిఎం సీనియర్ నాయకుడు మీగడ రాములు, మత్స్యశాఖ జిల్లా కార్యదర్శి శీలం శీను, సీనియర్ నాయకులు పాశం వెంకట నారాయణ,జక్కుల వెంకటేశ్వర్లు,చిన్న వీరమల్లు,శీలం వెంకన్న,శాఖా కార్యదర్శి వెంకటేశ్వర్లు,సైదయ్య,కోటయ్య, అరవింద్,లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

వరుణ్ తేజ్ వాల్మీకి టీజర్ కి సూపర్ రెస్పాన్స్

Satyam NEWS

“బేబి ప్రభావతమ్మ” అంటుంటే ఆనందం అంతా ఇంతా కాదు

Bhavani

సంబరాలు జరుపుకుంటున్న కాంగ్రెస్ నేతలు

Satyam NEWS

Leave a Comment