26.2 C
Hyderabad
November 3, 2024 21: 33 PM
Slider ఆంధ్రప్రదేశ్

అన్న క్యాంటిన్ల మూసివేతపై తీవ్ర నిరసనలు

pjimage (16)

ప్రతి రోజూ దాదాపుగా రెండున్నర లక్షల మంది పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటిన్లను మూసివేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో నెలకొని ఉన్న సుమారు 204 అన్నా క్యాంటిన్లను కొత్త ప్రభుత్వం జులై 31 రాత్రి నుంచి మూసి వేసింది. అన్న క్యాంటిన్లలో ప్రతి రోజూ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఒక్కొక్కటి కేవలం ఐదు రూపాయలకే సరఫరా చేస్తుంటారు. తమిళనాడులో అమ్మ క్యాంటిన్లు ఉన్నట్లే ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటిన్లు తెరవాలని భావించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2018 జులై ఆగస్టు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటిన్లను ఏర్పాటు చేశారు. హరే కృష్ణ ఛారిటబుల్ ఫౌండేషన్ నడిపే అక్షయ పాత్ర సంస్థ ఈ అన్నా క్యాంటిన్లను నిర్వహిస్తుంటుంది. భోజనం వండి వడ్డించే ఏర్పాట్లను కూడా అక్షయ పాత్ర సంస్థ చేపట్టింది. స్థానిక సంస్థలు అందుకు అవసరమైన టేబుళ్లు, పాత్రలు ఇతర మౌలిక వసతులను కల్పించే విధంగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నుంచి ఈ సంస్థకు విరాళం ఇస్తారు. తన కున్న వనరులను కూడా వినియోగించుకుని అక్షయ పాత్ర లాభాపేక్ష లేకుండా అన్న క్యాంటిన్లను నిర్వహించేది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే అక్షయ పాత్ర సంస్థకు కాంట్రాక్టు పొడిగించే విషయం పై ఎలాంటి హామీ ఇవ్వలేదు. పైగా ఇది పెద్ద కుంభకోణం అనే రీతిలో మాట్లాడారు. దాంతో జులై 11 నుంచి అన్న క్యాంటిన్లను మూసి వేయాలని అక్షయ పాత్ర నిర్ణయించింది. అయితే నెలాఖరు వరకూ కొనసాగించాలని వినతులు రావడంతో జులై నెలాఖరు వరకూ కొనసాగించి ఆ తర్వాత మూసివేశారు. అన్న క్యాంటిన్లలో సాధారణ పౌరులు ఎంతో మంది ఆకలి తీర్చుకునేవారు. పట్టణాలలో తగిన జీత భత్యాలు లేనివారు, కూలిపనులు చేసుకునే వారు అన్న క్యాంటిన్లలో ఆకలి తీర్చుకునేవారు. ఆసుపత్రులకు చికిత్స కోసం వచ్చే పేదలు, ప్రయాణీకులు కూడా అన్నా క్యాంటిన్లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వెళ్లి తినేవారు. విద్యార్ధులు ఇతర అల్పాదాయ వర్గాల వారు కూడా అన్న క్యాంటిన్లలో ఆకలి తీర్చుకునేవారు. కొత్త ప్రభుత్వం ఏర్పడగానే వీటి పేర్లను రాజన్న క్యాంటిన్లుగా మార్చి కొత్త ప్రభుత్వం కొనసాగిస్తుందేమోనని అక్షయ పాత్ర వారు ఎదురు చూశారు. అయితే లాంటి చర్యలు తీసుకోకపోవడంతో అక్షయ పాత్ర వారు అన్న క్యాంటిన్లను మూసివేశారు. దీనిపై పేద ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

జగదల్ పూర్ హైవే పై మక్క రైతుల ఆందోళన

Satyam NEWS

నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేలు ఇవ్వాలి

Satyam NEWS

విజయనగరం జిల్లాకు రెండు స్కాచ్ అవార్డులు

Satyam NEWS

Leave a Comment