39.2 C
Hyderabad
April 16, 2024 18: 37 PM
Slider నెల్లూరు

ప్రజా ప్రతినిధులు ప్రజల్లోకి వెళ్లాలి: ఎంపీ ఆదాల పిలుపు

#adala

కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు  గృహసారథులు ప్రజల్లోకి ముమ్మరంగా వెళ్లాలని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. 21, 22, 23 డివిజన్ల జగనన్న సచివాలయ కన్వీనర్లు, గృహ సారధుల శిక్షణ కార్యక్రమం పడారుపల్లిలోని ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపి ఆదాల తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ, అప్పుడే ఘన విజయం మన సొంతమవుతుందని తెలిపారు.

రాజకీయ నేతలను, పథకాల పంపిణీ కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం కోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి దీనిని తల పెట్టారని గుర్తు చేశారు. కార్పొరేటర్లు, స్థానిక నేతలు కూడా ఇందులో పాల్గొనాలని కోరారు. వైసీపీని ఢీకొనే సత్తా లేని ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. నెల్లూరు జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో గెలుపొందిన విషయం తెలిసిందేనని పేర్కొన్నారు.

అందుకే మేరుగ మురళి, స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవమయ్యారని, ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసిపి ప్రజాప్రతినిధులతో నిండిన నెల్లూరు జిల్లా, మన ఆధీనంలోనే ఉందని గుర్తు చేశారు. పెన్షన్ల పంపిణీ ఇతర ఇతర కార్యక్రమాల్లో కార్పొరేటర్లు పాల్గొనాలని, అప్పుడే ప్రజలతో వారు మమేకమవుతారని హితవు పలికారు.

ఎంపీ ఆదాలకు ఘన స్వాగతం

ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ ఆదా ల ప్రభాకర్ రెడ్డికి వేదమంత్రాలతో, ఘన సత్కారంతో కార్పొరేటర్లు, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇందుకు ఎంపీ ఆదాల వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ అధ్యక్షులు ఆనం విజయకుమార్ రెడ్డి  విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జెడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, స్వర్ణ వెంకయ్య, నవీన్ కుమార్ రెడ్డి, అవినాష్, సుధాకర్ యాదవ్, దాసరి రాజేష్, పిండి సురేష్, ఆర్.ఎస్.ఆర్, నూనె మల్లికార్జున యాదవ్, బొబ్బల శ్రీనివాస యాదవ్, మూల విజయభాస్కర్ రెడ్డి, మదన్మోహన్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, సన్నపురెడ్డి పెంచల్ రెడ్డి, సుబ్బారెడ్డి, మొయిళ్ళ గౌరీ, నరసింహులు గౌడ్, మేఘనాథ్ సింగ్, అబూబకర్, ఏసు నాయుడు, అల్లా బక్షు, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు, వైసీపీ అభిమానులు ఇందులో పాల్గొన్నారు. గృహ సారధుల అవగాహన నిమిత్తం ఒక ఏవిని ప్రదర్శించారు. ఇందులో వారి విధులు, బాధ్యతలను వివరించారు.

Related posts

తిరుమలలో సిబ్బందికి నిర్బంధ వైద్య పరీక్షలు

Satyam NEWS

ప్రతి దరఖాస్తును పరిశీలించాలి

Bhavani

నవజ్యోత్ సింగ్ సిద్ధూ పై ఆప్ నేత వ్యాఖ్యలు

Sub Editor

Leave a Comment