35.2 C
Hyderabad
April 20, 2024 16: 51 PM
Slider ఆంధ్రప్రదేశ్

రాజధాని తరలింపుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు

amaravati deeksha

రాజధాని అమరావతిని తరలించవద్దని అమరావతినే అభివృద్ధి చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇప్పటికే రాజధానిని నిర్ణయించి భూమిపూజ కూడా చేశారని, కొన్ని భవన నిర్మాణాలు కూడా జరుగుతున్నందున ఈ తరుణంలో తరలించకుండా సీఆర్‌డీఏను ఆదేశించాలని కోరుతూ పలువురు రైతులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన కోర్టు దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని సీఆర్డీఏను ఆదేశించింది.

పిటిషన్ పై విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ కోసం మూడు చోట్ల రాజధానుల నిర్మాణం జరిపే అవకాశం ఉందంటూ చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి రైతులు అమరావతిలో ఆందోళన చేస్తున్నారు. గురువారం రాజధాని పరిధిలోని 26 గ్రామాల బంద్ కు పిలుపునిచ్చారు.

Related posts

పేపర్ లీకేజ్ పై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

Satyam NEWS

బార్ల లైసెన్సులకు గెజిట్ నోటిఫికేషన్ జారీ

Satyam NEWS

త్రాగునీటి స‌మ‌స్య‌కు రూ.1.49 కోట్ల‌తో క్రాష్ ప్రోగ్రాం అమ‌లు

Satyam NEWS

Leave a Comment