39.2 C
Hyderabad
March 29, 2024 16: 37 PM
Slider జాతీయం

పెట్రో మంట నుంచి ప్రజలకు ఉపశమనం

#nirmalaseetaraman

పెట్రో ధరలు పెంచుతూ ఇంత కాలం జన జీవితాలతో ఆడుకున్న మోడీ ప్రభుత్వం ఎట్టకేలకు దేశ ప్రజలకు ఒక శుభవార్త చెప్పింది. పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్‌ సుంకం తగ్గించారు.

దాంతో లీటర్‌ పెట్రోల్ ధర రూ.9.50 తగ్గనున్నది. అలాగే లీటర్‌ డీజిల్‌ ధర రూ.7 తగ్గనున్నది. అదే విధంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు కేంద్రం తీపికబురు అందించింది. గ్యాస్‌ సిలిండర్‌పై రూ.200 రాయితీ ఇస్తున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది.

అలాగే చమురుపై సెంట్ర‌ల్ ఎక్సైజ్ సుంకాన్ని భారీగా త‌గ్గిస్తూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో రాష్ట్రాల్లో పెట్రోల్‌పై అదనంగా మరో రూపాయిన్నర, డీజిల్‌పై అదనంగా మరో రూపాయి తగ్గే అవకాశం ఉంది. దీనితో బాటు దేశంలో సిమెంట్‌, స్టీల్‌ ధరలు, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, ముడి పదార్థాలపై కూడా సుంకం తగ్గించారు. దాంతో వాటి ధరలు గణనీయంగా తగ్గనున్నాయి.

Related posts

అక్రమ రియల్ దందాకు సహాకరిస్తున్న అధికారులపై చర్యలు

Satyam NEWS

కాంగ్రెస్ గెలిచినా టీఆర్ఎస్ కొనేస్తుందని ఓట్లు వేయలేదు

Satyam NEWS

ప్రజా ప్రతినిధులకు మావోయిస్టుల హెచ్చరిక

Satyam NEWS

Leave a Comment