38.2 C
Hyderabad
April 25, 2024 13: 21 PM
Slider గుంటూరు

పెట్రో ధరలను తగ్గించాలని కౌలు రైతుల డిమాండ్

#NRT farmers

పెంచిన పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని మార్కెటింగ్ యార్డు వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పలువురు కౌలు రైతులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌలు రైతుల సంఘం పశ్చిమ గుంటూరు జిల్లా కార్యదర్శి ఎర్ర రాధాకృష్ణ మాట్లాడుతూ  మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ మనదేశంలో పెట్రోల్ ,డీజిల్, వంట గ్యాస్ ధరలు మండి పోతున్నాయని అన్నారు.

పెట్రోల్ డీజిల్ ధరలు 60 శాతానికి పైగా పన్నులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగదారుల వద్ద వసూలు చేస్తున్నాయని ఏ దేశంలో లేని ధరలు మన దేశంలో పెంచారన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు  అన్ని రంగాలపై ప్రభావం చూపుతాయని వ్యవసాయ రంగం మీద, నిత్యావసర వస్తువుల పెరుగుదల తో సామాన్యుడు బతకలేని పరిస్థితులు ఉన్నాయని ఆయన అన్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన పన్నులను ఉపసంహరించుకోవాలని, పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం పశ్చిమ గుంటూరు జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, నరసరావుపేట, రొంపిచర్ల కౌలు రైతు సంఘం నాయకులు కోండ్రు ఆంజనేయులు, పోట్లూరి అంజిరెడ్డి, మహమ్మవ్ద్ ఖాసిం, సుబ్బారావు, మార్కెటింగ్ యార్డు హమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు కోటి రెడ్డి గారు, పలువురు కౌలు రైతులు పాల్గొన్నారు.

Related posts

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం

Bhavani

డేంజర్ బెల్స్: మన రాజ్యాంగం ప్రమాదంలో పడిందా!

Satyam NEWS

“గణా”  ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్‌ చేసిన ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి

Satyam NEWS

Leave a Comment