36.2 C
Hyderabad
April 25, 2024 20: 13 PM
Slider విజయనగరం

విజయనగరం పోలీసు సిబ్బంది కి అందుబాటులో పెట్రోల్ బంక్

#vijayanagaram

విజయనగరం జిల్లా పోలీసు సిబ్బంది కి అందున నగరంలో ఉండే సిబ్బందికి అందుబాటులో ఉండే కొత్త పెట్రోల్ బంక్ ను ఎస్పీ దీపికా ప్రారంభించారు. నగరంలో డీఎస్పీ ఆఫీసు పక్కనే కొత్తగా నిర్మించిన పెట్రోల్ బంక్ ను జిల్లా పోలీసు బాస్ లాంఛనంగా ప్రారంభించారు.

గత ఎస్పీ రాజకుమారి.. ఈ పెట్రోల్ బంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పుడే విజయనగరం డీఎస్పీ గా వచ్చిన అనిల్..ప్రత్యేక దృష్టి పెట్టారు. కాగా ఇటీవలే నగరంలో కొత్త పేట వద్ద కొత్త గా నిర్మించిన టూటౌన్ పీఎస్ ను ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ చేతుల మీదుగా ఈ పెట్రోల్ బంక్ ను ప్రారంభింప చేద్దామనుకుంది..పోలీసు శాఖ.

అయితే సమయా భావం లేకపోవడంతో అప్పుడు ప్రారంభం కాలేదు. అయితే ఎట్టకేలకు ఎస్పీ చేతులు మీదుగా పెట్రోల్ బంక్ ప్రారంభించబడింది. విజయనగరం పట్టణ ప్రజలకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ ను అందించాలనే లక్ష్యంతో జిల్లా పోలీసుశాఖ ఆద్వర్యంలో గూడ్సు షెడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పోలీసు సంక్షేమ పెట్రోల్ బంకును  జిల్లా ఎస్పీ దీపిక ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తూ ఇండియన్ ఆయిల్ కార్పొరేషను సహకారంతో జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేసామన్నారు. నాణ్యమైన పెట్రోల్, డీజిల్ ను ప్రజలకు అందుబాటులో అందించాలనే లక్ష్యంతో పెట్రోల్ బంకును అందుబాటులోకి తీసుకొని వచ్చామన్నారు. ఇకపై నాణ్యమైన పెట్రోల్, డీజిల్ ను వాహనదారులకు పోలీసు సంక్షేమ పెట్రోల్ బంకు నుండి పొందవచ్చునన్నారు.

జిల్లా ఎస్పీ ఎం. దీపిక వేద పండితుల సమక్షంలో బంకు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, పెట్రోల్ బంకును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ఒఎస్డీ ఎన్. సూర్యచంద్రరావు, డిపిఓ ఎఓ జి. వెంకట రమణ, ఎస్బీ సీఐ ఎన్.శ్రీనివాసరావు, డీసిఆర్బీ సీఐ డా.బి.వెంకటరావు, టూటౌన్ సీఐ సిహెచ్. లక్ష్మణరావు, ఆర్ఐలు పి. నాగేశ్వరరావు, చిరంజీవి, ఐఓసిల్ సహాయక మేనేజర్లు కావ్య చరిత, కే.సాయి ప్రకాష్, ఆర్ఎస్ఐ నర్సింగరావు, ఎస్ఐ లు అశోక్, మురళి, సూర్యనారాయణ, సూర్యారావు, సత్యన్నారాయణ ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

అమానుషం: శరణార్థులు ఉన్న స్కూలుపై రష్యా బాంబుల దాడి

Satyam NEWS

వార్డుల వారీగా ప్రజా సమస్యల పరిష్కారానికి శ్రీకారం

Satyam NEWS

కి “లేడీ” ల‌ను ప‌ట్టుకున్న లేడీ పోలీస్….!

Satyam NEWS

Leave a Comment