36.2 C
Hyderabad
April 25, 2024 22: 59 PM
Slider జాతీయం

పెట్రోల్, డీజిల్‌ అసలు ధర ఎంత?.. వాత ఎంత?

దేశంలో తయారైన ఏదైనా వస్తువు ఉత్పత్తి దశలో కానీ, ఉత్పత్తి పూర్తయిన తర్వాత కానీ ఎక్సైజ్‌ సుంకాన్ని విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. విలువను బట్టి, లేదా నిర్థిష్టమైన మొత్తాన్ని పన్ను కింద వసూలు చేస్తారు. ఇలాగే పెట్రోల్‌, డీజిల్‌ మీద ఎక్సైజ్‌ డ్యూటీ కింద సుంకాన్ని వసూలు చేస్తుంది కేంద్రం.

2020 మే తర్వాత ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. 2020 మే 5న లీటర్‌కు 38 రూపాయల 78 పైసలకు పెంచింది కేంద్రం. దీంతో అప్పటి నుంచి పెట్రో ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం పెట్రోల్‌పై 32 రూపాయల 90 పైసలు సుంకం విధిస్తోంది కేంద్రం. ఇప్పుడు 5 రూపాయల సుంకాన్ని తగ్గించడంతో కేంద్రం విధించే ఎక్సైజ్‌ సుంకం 27 రూపాయల 90 పైసలకు తగ్గింది.

అటు డీజిల్‌పై ఉన్న 32 రూపాయల 80 పైసలుగా ఉన్న ఎక్సైజ్‌ డ్యూటీని 10 రూపాయలు తగ్గించడంతో ఇప్పుడు 21 రూపాయల 80 పైసలకు తగ్గింది. రాష్ట్రాలు కూడా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ విధిస్తాయి. అయితే ఒక్కో రాష్ట్రం ఒక్కో విధంగా ట్యాక్స్‌ విధిస్తుంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు నడిచాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 12 రూపాయల చొప్పున వ్యాట్ తగ్గించింది. ఇక గుజరాత్‌, కర్నాటక, గోవా, త్రిపుర, మణిపూర్‌, సిక్కిం రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై 7 రూపాయల చొప్పున వ్యాట్‌ తగ్గించాయి.

Related posts

ఆసక్తి రేకెత్తిస్తున్న కమల్ 232వ చిత్రం టీజర్

Satyam NEWS

ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కేసీఆర్:చిన్నారెడ్డి

Satyam NEWS

75 శాతం మంది పెద్దలకు కరోనా వ్యాక్సినేషన్ పూర్తి

Satyam NEWS

Leave a Comment