35.2 C
Hyderabad
April 20, 2024 17: 29 PM
Slider నల్గొండ

వాహనాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలి

sparjan raj

పోలీస్ స్టేషన్ల పరిధిలో పెట్రోలింగ్, ఎస్.హెచ్.ఓ. వాహనాల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని ఎం.టి. ఇన్స్ పెక్టర్ స్పర్జన్ రాజ్ పోలీస్ అధికారులను కోరారు.

డిఐజి, జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ఆదేశాల మేరకు ఏ.ఆర్. డిఎస్పీ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన జిల్లాలోని 36 పోలీస్ స్టేషన్ల పరిధిలోని పెట్రోలింగ్ ఇన్నోవాలు, ఎస్.హెచ్.ఓ.ల వాహనాలను తనిఖీ చేసి వాటి నిర్వహణ, వాహనాల కండిషన్ పరిశీలించి ఇన్స్ పెక్టర్లు, డ్రైవర్లకు అవసరమైన సూచనలు చేశారు. తెలంగాణా పోలీస్ శాఖ లక్ష్యానికి అనుగుణంగా జిల్లాలోని ప్రతి ఒక్క పోలీస్ అధికారి ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించేలా పెట్రోలింగ్ వాహనాలు మంచి కండిషన్ లో ఉండేలా చర్యలు తీసుకోవాలని అప్పుడే ఘటనా స్థలాలకు సకాలంలో చేరుకునే అవకాశం ఉంటుందని అన్నారు. డయల్ 100 పిర్యాదుల పరిష్కారం, విజిబుల్ పోలీసింగ్, మహిళల రక్షణ, రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రాంతాలకు సకాలంలో చేరుకోవడంలో పెట్రోలింగ్ వాహనాలు కీలకంగా పని చేస్తాయని అందుకే వాహనాలను ఎప్పటుకప్పుడు మంచి కండిషన్ లో ఉండేలా చూసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని వాహనాల నిర్వహణ సక్రమంగా ఉండేలా ఎం.టి. విభాగం నిరంతర పర్యవేక్షణ చేస్తుందన్నారు.

వాహన నిర్వహణ తీరు ఆధారంగా రివార్డులు

పోలీస్ స్టేషన్ల వారీగా ఉన్న పెట్రోలింగ్, ఎస్.హెచ్.ఓ.ల వాహనాలను కండిషన్ లో ఉంచుతూ, నిర్వహణ సక్రమంగా ఉన్న వాహనాలను గుర్తించి సంబంధిత డ్రైవర్లకు రివార్డులు అందించి ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పారు. అదే సమయంలో అసంతృప్తిగా ఉన్న వాహనాలు, వాటి నిర్వహణ పట్ల శ్రద్ధ వహించని పోలీస్ అధికారులు, డ్రైవర్ల పనితీరుపై నివేదికల ఆధారంగా జిల్లా ఎస్పీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రతి పోలీస్ అధికారి తమ పరిధిలోని పెట్రోలింగ్, పోలీస్ స్టేషన్ వాహనాలను స్వంత వాహనాల మాదిరిగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు సర్వీసింగ్, ఆయిల్ చేంజ్ తో పాటు వాహనాలను నిత్యం శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

వాహనాల నిర్వహణ తీరుపై ఎస్పీకి నివేదిక

డిఐజి ఏ.వి. రంగనాధ్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని రకాల వాహనాలను తనిఖీ చేసి వాటి నిర్వహణ, పోలీస్ అధికారులు తీసుకుంటున్న శ్రద్ద పరిశీలించడం జరిగిందని స్పర్జన్ రాజ్ తెలిపారు. వాహనాల నిర్వహణ విషయంలో సమగ్ర నివేదిక రూపొందించి ఎస్పీకి నివేదిక సమర్పించడం జరిగిందని తెలిపారు. ఇకపై ప్రతి నెలా వాహనాల పనితీరు పర్యవేక్షించి నెలవారీ నివేదిక ఉన్నతాధికారులకు సమర్పించడం జరుగుతుంది ఆయన చెప్పారు.

ఎం.టి. ఇన్స్ పెక్టర్ స్పర్జన్ రాజ్ తో పాటు ఏ.ఆర్.ఎస్.ఐ.లు ఖాసీం, లియాఖత్, సిబ్బంది ప్రసాద్, కరుణాకర్ వాహనాల తనిఖీల్లో పాల్గొన్నారు.

Related posts

తెలుగు సినిమాకు స్ఫూర్తి ప్రదాత డివిఎస్ రాజు

Satyam NEWS

రాజశేఖర రెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

Satyam NEWS

మైనారిటీ నాయకుడి పై గంజాయి కేసు పెట్టించిన నరసరావుపేట ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment