28.7 C
Hyderabad
April 20, 2024 02: 58 AM
Slider జాతీయం

పెట్రోలియం, ప్రేలుడు పదార్ధాల భద్రతా సంస్థ చర్యలు

govt of India

కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా పెట్రోలియం, ప్రేలుడు పదార్ధాలు, ఆక్సిజన్, పారిశ్రామిక గ్యాస్ పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి పెట్రోలియం, ప్రేలుడు పదార్ధాల భద్రతా సంస్థ (పి.ఈ.ఎస్.ఓ.) ఈ చర్యలు చేపట్టింది.

1. వైద్య పరమైన ఆక్సిజెన్ నిల్వ చేయడానికీ, రవాణా చేయడానికీ వెంటనే అనుమతి మంజూరు లభించేలా  పి.ఈ.ఎస్.ఓ. కు చెందిన అన్ని సర్కిల్, సబ్ సర్కిల్ కార్యాలయాలకు సూచనలు జారీ చేశారు.

2. దేశంలో కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవలసిన చర్యలపై హోంమంత్రిత్వశాఖ జారీ చేసిన ఆదేశాలు నెంబరు:  40-3/2020 తేదీ: 24/03/2020 కి అనుగుణంగా వైద్య పరమైన ఆక్సిజన్, నైట్రోజన్ ఆక్సైడ్ తయారీ, రవాణాలను నిరంతరాయంగా అనుమతించవలసిందిగా కోరుతూ అన్ని రాష్ట్రాలకు చెందిన హోంశాఖ ప్రధాన కార్యదర్శులకు సూచన చేశారు.

3. ఆక్సిజన్, ఇతర గ్యాస్ ల రవాణాకోసం 31/03/2020 తేదీన ముగిసే లైసెన్స్ గడువును 30/06/2020 తేదీ వరకు పొడిగించడమైనది.

4. ప్రేలుడు పదార్ధాలు బాణాసంచా తయారీ, నిల్వ, రవాణా, అమ్మకం, వినియోగం కోసం 31/03/2020 తేదీన ముగిసే లైసెన్స్ గడువును కూడా 30/06/2020 తేదీ వరకు పొడిగించడమైనది.  లైసెన్సులను ఆలస్యంగా పునరుద్ధరించుకోడానికి ఎటువంటి అపరాధ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.

5. కంప్రెస్డ్ ఆక్సిజన్, సి.ఎన్.జి., ఎల్.పి.జి., ఇతర గ్యాస్ ల నిల్వ కోసం ఉపయోగించే సిలిండర్లకు చట్ట బద్ధమైన హైడ్రో పరీక్ష నిర్వహించడానికి గడువు తేదీ 31/03/2020 కాగా, ఆ గడువు తేదీని 30/06/2020 గా పరిగణిస్తారు.

6. ఆక్సిజన్, ఎల్.పి.జి., మరియు ఇతర గ్యాస్ ల నిల్వ, రవాణా కోసం ఉపయోగించే ప్రెషర్ వెస్సెల్స్ సేఫ్టీ రిలీఫ్ వాల్వ్ ల చట్ట బద్దమైన పరీక్షలకు 15/03/2020 తేదీ నుండి 30/06/2020 మధ్య కాలంలో ఉన్న గడువు తేదీలను 30/06/2020 తేదీన గడువుగా పరిగణిస్తారు.

Related posts

మతి స్థిమితం లేని ఈ మహిళను గుర్తుపట్టగలరా?

Satyam NEWS

ది డే ఫర్ ద ఫాదర్: నాన్న అంతా నువ్వే

Satyam NEWS

ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం

Satyam NEWS

Leave a Comment