28.7 C
Hyderabad
April 20, 2024 05: 20 AM
Slider నల్గొండ

అసంఘటిత రంగ కార్మికులకు P.F, E.S.I సౌకర్యం కల్పించాలి

#AITUC

ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులకు పిఎఫ్, ఈ ఎస్ ఐ సౌకర్యం కల్పించాలని ఏ ఐ టి యు సి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసరావు అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన నేటికీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పాలకులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో లో టి ఆర్ ఎస్ ప్రభుత్వం వన్ రచయిత స్థితికి దిగజారిందని కార్మిక చట్టాలను బలోపేతం చేయాల్సింది పోయి వాటిని బలహీనపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో బిజెపి, రాష్ట్రంలో టిఆర్ఎస్ కార్మికులను, కార్మిక సంఘాలను విచ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని, నాయకులకు తాయిలాలు ఇచ్చి సంఘాలను చీలిక దిశగా ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని కార్మికులను, కార్మిక సంఘాలను రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్, యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ములకలపల్లి రాంబాబు, డి.సత్యానందం, షేక్. బాషా,యం. శ్రీనివాసు, రాజు, కొండలు, వెంకటేశ్వర్లు, యం.నరసింహారావు, లక్ష్మణ్ రావు, డి. వీరబాబు, జి. రామకృష్ణ, మంగయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి

Satyam NEWS

తక్షణమే ఎల్ ఆర్ ఎస్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్

Satyam NEWS

టమాటా తో కోటేశ్వరులు

Bhavani

Leave a Comment