40.2 C
Hyderabad
April 19, 2024 17: 31 PM
Slider నల్గొండ

కార్మికులందరికీ P.F మరియు E.S.I సౌకర్యం కల్పించాలి

#AITUCmeeting

అసంఘటిత రంగాల కార్మికులందరికీ P.F, E.S.I సౌకర్యం కల్పించాలని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని CPI కార్యాలయంలో AITUC అనుబంధ కార్మిక సంఘం ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్ల జనరల్ బాడీ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో లక్షలాది మంది కార్మికులు కరోనా వలన పనిని కోల్పోయి కుటుంబం గడవని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు గురవుతున్నారని, భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నెలకి పదివేల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కరోనా విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో కూడా ప్రజలకు కావలసిన వైద్య సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, యూనియన్ నాయకుడు ములకలపల్లి శ్రీను, యం. రాంబాబు, సత్యానందం, నరసింహారావు, భాషా, లక్ష్మణరావు, వీరబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేవరగట్టు అభివృద్ధికి సహకరిస్తాం

Bhavani

బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని ఆత్మహత్య

Bhavani

జగన్, కేసీఆర్ లపై విల్లంబు ఎక్కుపెట్టిన కమలనాథులు

Satyam NEWS

Leave a Comment