32.2 C
Hyderabad
April 20, 2024 20: 09 PM
Slider మహబూబ్ నగర్

నారాయణపేట జిల్లా కేంద్రంలో PG కళాశాలను ఏర్పాటు చేయాలి

#PDSU Narayanapet

నారాయణపేట జిల్లా కేంద్రంలో పీజీ కళాశాల,  ఓపెన్ పిజీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్ పల్లి రాము కోరారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ లోని పిడిఎస్ యు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య వక్త గా హాజరై మాట్లాడారు. నారాయణపేట జిల్లా కర్ణాటక సరిహద్దు లో ఉంటుంది.

దేశంలోనే అత్యంత కరువు ప్రాంతం, సాగు నీరు, తాగునీరు లేక  వ్యవసాయం సరిగా నడవదు. ప్రజలు ప్రతి యేడాది వేల సంఖ్యలో బొంబాయి, పట్నం, గుజరాత్ లాంటి పట్టణాలకు వలసలు వెళుతుంటారు. ఈ వలసల్లో  ఇంటర్, డిగ్రీ విద్యను అభ్యసించి న విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో ఉంటారు.

వీరు ఆర్ధిక పరిస్థితులు బాగలేక, ఉన్నత విద్య ను అభ్యసించే అవకాశం లేక వలసలు వెళుతున్నారు. నారాయణ పేట జిల్లాలో డిగ్రీ విద్యను  దాదాపు 3000 మందికి పైగా  చదువుతున్నారు. దాంట్లో ప్రతి సంవత్సరం డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు  1000 కి పైగా విద్యార్థులు డిగ్రీ పట్టా పుచ్చుకుని పై చదువుల కోసం వివిధ ప్రాంతాలకు వెళుతున్నారు.

అందులో ఛాలా మంది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే విద్య ను వదిలేసి ఉన్నత విద్య కు దూరం అవుతున్నారు.

ఈ అంశాలను దృష్టి లో ఉంచుకుని ఈనెల 10న నారాయణపేట జిల్లాకు వస్తున్న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ ప్రాంతానికి పీజీ కళాశాల ఏర్పాటు చేయడానికి కృషి చేయాలని, వచ్చే అకడమిక్ ఇయర్ లో జిల్లా కేంద్రంలో విద్యార్థులకు పై చదువుల కోసం,PG సెంటర్ ను ఓపెన్ పీజీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో PDSU జిల్లా అధ్యక్షకార్యదర్శి లు సాయికుమార్,  అజయ్, కోశాధికారి గౌస్, నాయకులు సాయి  తదితరులు పాల్గొన్నారు.

Related posts

తల్లి మృతదేహం తీసుకెళ్లిన కూతుళ్లు

Satyam NEWS

వెంటనే నాగార్జున సాగర్ నీటిని విడుదల చేయండి

Satyam NEWS

చకచకా సాగుతున్న అయోధ్య రామమందిర నిర్మాణం

Satyam NEWS

Leave a Comment