37.2 C
Hyderabad
March 28, 2024 17: 29 PM
Slider నల్గొండ

ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలు

#nspcamp

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎన్ ఎస్ పి క్యాంపు లోని భవిత కేంద్రంలో సమగ్ర శిక్షా అభియాన్ – విద్యాశాఖ,సూర్యాపేట జిల్లా ఆధ్య్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి సైదా అధ్యక్షత వహించి మాట్లాడుతూ దివ్యాంగుల చిన్నారులలో వైకల్యం అనేది వారి శరీరానికే గాని వారి మనసుకు కాదని,వారి నైపుణ్యానికి అనుగుణంగా తర్ఫీదు ఇవ్వడానికే భవిత కేంద్రాలు ఉన్నాయని,వీటిని తల్లిదండ్రులు సక్రమంగా ఉపయోగించుకోవాలని కోరారు.

సమగ్ర శిక్షా వారు ఉచిత ఉపకరణాలు,ఉచిత ఆపరేషన్లు,అలెవెన్సెస్ తదితరములు అన్ని ఇవ్వడం జరుగుతుందని,ఫిజియోథెరపి సేవలు కూడా ఇవ్వడం జరుగుతుందని కనుక భవిత కేంద్రం నందలి ఐ ఈ ఆర్ పి  సేవలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం ముదిగొండ రవికుమార్ (మేఘన హాస్పిటల్ – మెడికల్ షాప్) చిన్నారులకు 30 దుప్పట్లను మండల విద్యాశాఖ అధికారి చేతిమీదుగా అందజేశారు.

ఆటలలో పాల్గొన్న ప్రతి ఒక్క చిన్నారికి బహుమతిని అందజేశారు. ర్యాలీ నిర్వహించిన అనంతరం కుక్కల మధుబాబు నిఘా పేపర్ రిపోర్టర్ దివ్యాంగులకు,వారి తల్లిదండ్రులకు భోజన సదుపాయం కల్పించారు. మర్రిగూడెం ప్రధానోపాధ్యాయుడు నందిపాటి సైదులు కుమారుడు తేజా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు పండ్లు, మిఠాయిలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్పిహెచ్ఎస్ బాలుర ప్రధానోపాధ్యాయురాలు  రాధాదుర్గ,పి ఎస్ ప్రధానోపాధ్యాయుడు యతీపతిరావు,ఐ సి డి ఎస్ హుజూర్ నగర్ సూపర్వైజర్లు హేమాదేవి,నిర్మల, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ మీరా,ఐ ఈ ఆర్ పి లు పెండెం శ్రీనివాస్,గోవింద్, సి ఆర్ పి లు సైదులు,రమేష్,బ్రహ్మం, ఎం ఐ ఎస్ సమీనా,ఎల్ డి ఏ అబ్దుల్ అలీం,మెసెంజర్ జయరాజు,కేర్ గివ్ వాలంటీర్ నాగమణి, హుజూర్ నగర్ మండలం లోని దివ్యాంగ చిన్నారులు,వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

జ‌న‌వ‌రి 19 వరకు శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

Satyam NEWS

మండు వేసవిలో… వర్షం…విజయనగరం లో విడ్డూరం

Satyam NEWS

బీజేపీ మేనిఫెస్టో!

Sub Editor

Leave a Comment