37.2 C
Hyderabad
March 29, 2024 19: 04 PM
Slider జాతీయం

తప్పుల తడకగా పీఐబీ ఫ్యాక్ట్ చెక్

కేంద్ర ప్రభుత్వంపై వస్తున్న విమర్శల్లోని వాస్తవాలు, ఆవాస్తవాల నిగ్గు తేల్చేందుకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ను ప్రవేశ పెట్టింది. రైల్వే ప్రైవేటీకరణపై భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధి స్పందించారు. దేశ జీవన రేఖ అయిన రైల్వే లను ప్రైవేటీకరించకుండా రైల్వేల బలోపేతం పై దృష్టి సారించాలని రాహుల్ గాంధి కోరారు. అయితే రాహుల్ విమర్శలను ప్రభుత్వ పెద్దల కన్నా ముందే పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. రైల్వే ప్రైవేటీకరణపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. కాని 2019 లోనే 151 ట్రైన్ల ప్రైవేటీకరణపై కేంద్రం అడుగులు మొదలుపెట్టింది. ఎంపిక చేసిన 151 రూట్లలో ప్రైవేటు రైల్లను ప్రవేశ పెట్టేందుకు ఐదుగురు సెక్రటరీలతో ఉన్నత స్ధాయి కమిటీని ఏర్పాటు చేసింది.

భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు కోరుతూ పీఐబీ, రైల్వే వెబ్ సైట్లలో ఈ ఉన్నత స్థాయి కమిటి నివేదికలను అప్ లోడ్ చేసింది. ఈ విషయాన్ని అప్పటి రైల్వే శాఖ మంత్రి పియుష్ గోయల్ పార్లమెంటులోనే సమాధానమిచ్చారు. కాని ఇప్పుడు ఆ వాస్తవాలను దాచి రైల్వే ప్రైవేటీకరణపై రాహుల్ ఆరోపణలు తప్పని పీఐబీ ట్వీట్ చేసి అడ్డంగా బుక్కైంది. ఫ్యాక్ట్ చెక్ అంటే నిజాలు చెప్పాలి కానీ..ఇలా ప్రభువుల ప్రాపకం కోసం తప్పుడు ప్రచారం చేయడం పీఐబీ కి తగదంటున్నారు ప్రజలు.

Related posts

నకిలీ వార్తలకు చెక్ పెట్టేందుకు నిబంధనల విడుదల

Satyam NEWS

హోమియోపతి వైద్య సృష్టి కర్త డా. హనీమన్ విగ్రహ ఆవిష్కరణ

Satyam NEWS

దేశీయంగా చిప్ ల తయారీ పరిశోధనలపై సీబీఐటీకి ప్రాజెక్టు

Satyam NEWS

Leave a Comment