Slider మహబూబ్ నగర్

పందుల దోపిడి కేసులో  నలుగురు నిందితుల రిమాండ్

#wanaparthyPolice

వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పరమేశ్వర స్వామి చెరువు కట్ట దగ్గర ఉన్న పందుల షెడ్డుపై ఆకస్మికంగా దాడి చేసి పందుల దొంగతనానికి పాల్పడిన నిందితులను  గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్  తెలిపారు. పరమేశ్వర స్వామి చెరువు కట్ట సమీపంలో నీటి వసతి ఉన్నందున చెన్నయ్య అనే వ్యక్తి షెడ్డు వేసుకొని 73 పందులను పెంచుకుంటున్నాడని, అ క్రమంలో 16వ తేదీ నాడు ఆత్మకూరులోని చెరువు కట్ట దగ్గర బ్రిడ్జి కింద ఉన్న పందులను నిందితులు బింగిదొడ్డి అంజి(ఎ4), మాదిరే మహేష్ (ఎ8) నందవరం బాలరాజు(ఎ9) లు ముగ్గురు వచ్చి రెక్కి నిర్వహించారు.

నిందితులు ఇంతకు ముందు వనపర్తి జిల్లా ఏదుట్ల గ్రామం గోపాల్ పేట మండలం, దొడగుంటపల్లి గ్రామం పెద్దమందడి మండలంలో, గద్వాల జిల్లాలో అలంపూర్, శాంతినగర్, ఐజా, కర్నూల్ జిల్లలో మంత్రాలయం, ఎమ్మిగనూర్, నందవరం మాధవరం, కర్ణాటకలో బళ్ళారి, రాయచూర్, మస్కి, హుబ్లి, సిందనూర్ ఏరియాలలో పందుల దొంగతనం చేశారు. ఎస్పీ వనపర్తి , డీఎస్పీ వనపర్తి పర్యవేక్షణలో ఆత్మకూరు సీఐ,శివకుమార్, అత్మకూరు ఎస్సై,నరేందర్, అమరచింత ఎస్సై,సురేష్,  అధ్వర్యంలో వారి సిబ్బంది భీమయ్య, సత్యనారాయణ గౌడ్, పురుషోత్తం, క్రాంతి,  టెక్నికల్ టీం గోవిందు, మురళి ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు.

నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి. 1) సిద్దు, యెరుకలి సిద్దప్ప, ఇంద్రనగర్ కాలనీ, సిందనూరు గ్రామం, కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా మండలం.2. యెరుకలి అంజి, కర్నూలు జిల్లా, ఆదోని మండలం హోలిగొండ గ్రామం.  3. యెరుకలి నాగరాజు కర్ణాటక రాష్ట్రం, బళ్లారి జిల్లా, సిరిగుప్ప మండలం సిరియేరి గ్రామం. 4) యెరుకలి అంజి, ఆంజనేయులు, జోగులాంబ గద్వాల్ జిల్లా అయిజ మండలం బింగిదొడ్డి గ్రామం. 5.యెరుకల్ భీమన్న,  యెమ్మిగనూరు టౌన్, కర్నూలు జిల్లా. 6. గుల్లి నాగరాజు అలియాస్ యార్కల నాగరాజు  యెమ్మిగనూరు టౌన్, కర్నూలు జిల్లా.7.యమ్మిగనూరు మండలం కందనతి గ్రామం కందెనాథ్ సుంకన్న  (పరారీలో ఉన్నారు)

8.మదిరె మహేష్, మదిరె గ్రామం కౌతాళం మండలం, కర్నూలు జిల్లా.  (పరారీలో ఉన్నారు). 9.నందవరం బాలరాజు అలియాస్ యెరుకుల బాలరాజు నందవరం గ్రామం, మండలం.  కర్నూలు జిల్లా.  10.  గోనెగండ్ల సతీష్ అలియాస్ యెరుకలి సతీష్ గోనెగండ్ల గ్రామం కర్నూలు జిల్లా 01-బొలెరో వాహనం, 90 వేల రూపాయలు 3 సెల్ ఫోన్లు పోలీసుల స్వాధీనంలో ఉన్నాయి. మీడియా సమావేశంలో వనపర్తి డిసిఆర్బి డీఎస్పీ, అదనపు ఎస్పీ ఉమామహేశ్వర రావు,ఆత్మకూరు సీఐ, శివకుమార్, ఆత్మకూరు ఎస్సై,నరేందర్ , అమరచింత ఎస్సై, సురేష్ ,పోలీసు సిబ్బంది ఉన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

బాలాపూర్ వినాయకునికి తొలి పూజ

Satyam NEWS

వి ఎస్ యూ లో ఆడియో వీడియో విజువల్ సెంటర్ ప్రారంభం

mamatha

వలస కూలీలను వెంటాడిన హై వే రోడ్డు ప్రమాదం

Satyam NEWS

Leave a Comment