30.2 C
Hyderabad
February 9, 2025 20: 13 PM
Slider ముఖ్యంశాలు

ముదురుతున్న తెలంగాణ తల్లి విగ్రహ వివాదం

#telanganatalli

తెలంగాణ తల్లి విగ్రహం లో మార్పులు చేయకుండా, డిసెంబర్ 9న మార్చిన విగ్రహం ప్రతిష్టను ఆపాలని ప్రముఖ రచయిత జూలూరి గౌరీ శంకర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు హైకోర్టు లో పిల్ వేశారు. తెలంగాణ ప్రజలు, మేధావులు, రచయితలు,కవులు,  కళాకారులు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తున్నారని ఆయన అంటున్నారు. విగ్రహం లో మార్పులు అంటే తెలంగాణ అస్తిత్వంపై జరుగుతున్న దాడిగా తెలంగాణ సమాజం భావిస్తున్నదని వారంటున్నారు.

తెలంగాణ నా కోటి రనాల వీణ అని మహాకవి దాశరధి అన్నట్టుగానే నాడు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అనేక మంది మేధావులు, తెలంగాణ ఆత్మబంధువుల సమక్షంలో ఉద్యమకాలంలో రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లిని కేసీఆర్ మీద రాజకీయ కక్షతో తెలంగాణ మీద ఈసమెత్తు కూడా అవగాహన లేని వ్యక్తి నేడు కుట్రలు చేయడాన్ని తెలంగాణ సమాజం ఖండిస్తున్నదని వారు అంటున్నారు. డిసెంబర్ 9న సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టను ఆపాలని పిల్ దాఖలు చేశారు.

Related posts

అప్పుడే తాడేపల్లిలో వణుకు మొదలైంది

Satyam NEWS

పోలీసులలో కొత్త స్ఫూర్తిని నింపిన అమర వీరుల దినోత్సవం

Satyam NEWS

తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి

Satyam NEWS

Leave a Comment