32.2 C
Hyderabad
March 28, 2024 23: 16 PM
Slider విజయనగరం

మహిళా దినోత్సవం రోజున పింక్ మార్ థాన్ పరుగు

#Womens Day Vijayanagaram

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలోని విద్యలనగరమైన విజయనగరం లో పింక్ మార్ థాన్ పరుగు నిర్వహించింది జిల్లా పోలీస్ శాఖ. ఈ పరుగును జిల్లా జడ్జి గోపీ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ పరుగులో బొబ్బిలి కి చెందిన శారద విజేతగా నిలిచారు.ఈ సందర్భంగా విజేతకు అయిదువేల నగదు బహుమతిని ఇచ్చారు.. జిల్లా జడ్జి గోపీ,ఎస్పీ రాజకుమారీ లు.

అంతకుముందు ఎస్పీతో పాటు పోలీసు శాఖ నిర్దేశించిన మూడు కిలో మీటర్ల పరుగు లో పాల్గొన్నారు….జిల్లా జడ్జి. ఈ పరుగు మయూరీ జంక్షన్ వద్ద మొదలై….రైల్వే స్టేషన్, సీఎంఆర్ ,గూడ్స్ షెడ్ ,డీఎస్పీ ఆఫీసు ,బాలాజీ మార్కెట్ ,గణేష్ కోవెల ,కలెక్టరేట్,జిల్లా పోలీసు కార్యాలయం మీదుగా దిశ పీఎస్ వరకూ సాగింది. 

మయూరీ జంక్షన్ వద్ద జరిగిన సభలో మహిళ అంటే స్థిత ప్రజ్ఞురాలని ,పురుషుడు చపలత్వం కలవాడని జిల్లా జడ్జి అన్నారు. నేటి మహిళ వంటింటి కుందేలు కాదని….పిల్లల్లో మార్పునకు కన్నవాళ్లే కా‌రణమని అన్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఆడది అంటే అబల కాదని సబల అన్నారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సూర్యనారాయణ రాజు,ఏఆర్ డీఎస్పీ శేషాద్రి ,దిశ డీఎస్సీ త్రినాథ్ ,ట్రాఫిక్ డీఎస్పీ మోహనరావు,విజయనగరం డీఎస్పీ అనిల్ ,సీఐలు మంగ వేణి ,మురళీ ,ఎర్రంనాయుడు, శ్రీనివాసరావు, ఎస్ఐ లు భాస్కరరావు, కిరణ్ ,హరిప్రసాద్ అలాగే ఎంఆర్,గాయత్రీ ,సత్య ,కాలేజీలకు చెందిన విద్యార్ధినీలు పాల్గొన్నారు.

Related posts

A Tale of the City పుస్తకాన్ని ఆవిష్కరించిన మామిడి హరికృష్ణ

Satyam NEWS

పాన్ కార్డు, ఆధార్ లింక్ కు ఈ రోజే ఆఖరు

Satyam NEWS

దేశ సమస్యలపై నీలాదీస్తాం

Bhavani

Leave a Comment