31.7 C
Hyderabad
April 18, 2024 23: 09 PM
Slider విజయనగరం

మహిళా దినోత్సవం నేపథ్యంలో విజయనగరంలో పింక్ థాన్ రన్

#pinkthon

అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. మార్చి 8న. అయితే విద్యల నగరమైన విజయనగరం లో ఒక్క రోజు ముందుగానే ఆ దినోత్సవం వచ్చింది. ఈ మేరకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర మైన విజయనగరం లో పింక్ థాన్ రన్ జరిగింది. ఈ సందర్భంగా నగరంలో ఎస్పీ బంగ్లా సమీప జంక్షన్ లో అన్ని స్కూళ్ల, కాలేజీల విద్యార్థినీలు, మహిళా సంరక్షణ పోలీసులతో పరుగు జరిగింది.

స్థానిక మయూరి జంక్షన్ నుంచీ రైల్వేస్టేషన్, సీఎంఆర్ ,గూడ్స్ షెడ్, బాలాజీ టెక్స్ట్ టైల్ మార్కెట్, గంజిపేట ,కలెక్టరేట్, కంట్రోల్ రూమ్, జిల్లా పోలీసు శాఖ, దిశ పీఎస్ వరకూ ఆ రన్ జరిగింది. రన్ లో మొదటి, రెండవ, తృతీయ, ప్రోత్సాహక బహుమతుల నేపథ్యంలో నగదు ను ఇచ్చారు.

ప్రత్యేకించి ఈ రన్ ముగ్గురు చిన్నారులు కూడా పాల్గొనడంతో విజయనగరం ఎస్పీ దీపికా పాటిల్ సంబరపడి..ఆ చిన్నారులకు నగదు బహుమతులు ఇచ్చారు.  కస్పా ,మోడల్ స్కూళ్లకు చెందిన శ్రావణి,మౌనిక ,భార్గవి లు ఎస్పీ చేతులు మీదుగా నగదు బహుమతులను అందుకున్నారు. అలాగే వన్ టౌన్ నుంచీ మహిళా కానిస్టేబుల్ సౌజన్య కూడా బహుమతి అందుకున్నారు. అంతకుముందు ఎస్పీ మాట్లాడుతూ… అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ఈ పింక్ థాన్ పరుగులో ప్రతీ మహిళ పాల్గొని.. శారీరక ధృడత్వాన్ని కలవరచుకోవాలన్నారు.

తద్వారా మహిళా లోకానికి ఓ దిక్సూచి కావాలని ఎస్పీ కోరారు. అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని, ఒకరికొకరు చేయూతను అందించుకొని మరింత ప్రగతి సాధించాలన్నారు.  మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపవద్దని, ప్రత్యేక శ్రద్ద పెట్టాలని కోరారు. మహిళల భద్రత, రక్షణకు పోలీసుశాఖ పని చేస్తున్నదన్న విషయాన్ని అందరికీ తెలపాలని, ప్రతీ ఒక్కరూ తమ మొబైల్స్ లో దిశా యాప్ ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోవాలని మహిళలను కోరారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం సబ్ డివిజన్ ఇంచార్జీ అదనపు ఎస్పీ  అనిల్ పులిపాటి, ఎఆర్ డిఎస్పీ  ఎల్.శేషాద్రి, సిఐలు ఎన్.శ్రీనివాసరావు, జి.రాంబాబు, ఎం.శేషు, టిఎస్ మంగవేణి, జే.మురళి, సిహెచ్.లక్ష్మణ రావు, ఆర్ఐలు పి.నాగేశ్వరరావు, శ్రీరాములు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్దినీలు పాల్గొన్నారు.

Related posts

రాజధాని లేని దురదృష్టకర రాష్ట్రంగా ఏపీ

Bhavani

ప్రేక్షకులకు చెప్పాల్సిన కథ ‘యశోద’

Bhavani

ఉప్పల్ లో ప్రజా సమస్యలపై సమన్వయ సమీక్ష

Satyam NEWS

Leave a Comment