31.2 C
Hyderabad
May 29, 2023 21: 55 PM
Slider ప్రత్యేకం

జో బిడెన్ హత్యకు తెలుగువాడి కుట్ర

#joebiden

అమెరికా అధ్యక్షుడు జోబైడన్‌ హత్యకు కుట్ర జరిగింది. ఆ కుట్ర చేసింది తెలుగు యువకుడు సాయివర్షిత్‌ అని పోలీసులు అంటున్నారు. అమెరికాలోని మిస్సోరి స్టేట్‌లో ఉంటున్న సాయి వర్షిత్‌ ఈ దుశ్చర్య కు పాల్పడ్డాడని అంటున్నారు. అక్కడి నుంచి వాషింగ్‌టన్‌ డీసీకి వచ్చిన సాయి వర్షిత్‌ వచ్చీ రాగానే ఓ ట్రక్‌ను అద్దెకు తీసుకున్నాడు. ట్రక్‌తో వైట్‌హౌస్‌లోకి దూసుకెళ్ళినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్‌తో ఒకటిరెండుసార్లు ఢీ కొడుతూ ముందుకెళ్లే యత్నం చేశాడు. జో బైడెన్‌ హత్యకు సాయి కుట్ర చేసినట్లు పోలీసులు నిర్ధారణ చేశారు. ఇందుకు ఆరు నెలలుగా ప్లాన్‌ చేసినట్లు సాయి ఒప్పుకున్నాడు. సాయిపై అమెరికా పోలీసుల FIR నమోదు చేశారు. సాయి వెనుక ఎవరు ఉన్నారు? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.

Related posts

విజ‌య‌న‌గ‌రం జిల్లా లో వ‌రి, మొక్క‌జొన్న ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ ప‌రిశ్ర‌మ‌లు

Satyam NEWS

“అక్షత శ్రీనివాస్ ఆదరగొట్టింది” అనిపించుకోవాలి

Satyam NEWS

NSUI ఆధ్వర్యంలో సిఎం దిష్టి బొమ్మ దగ్ధం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!