ప్రయాణీకులతో ఉన్న ఒక జెట్ విమానం ఆర్మీ హెలికాప్టర్ తో ఢీ కొట్టడంతో భారీ ప్రమాదం సంభవించింది. వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న జెట్ బుధవారం ల్యాండ్ అవుతున్నప్పుడు ఆర్మీ హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. ఢీ కొనడానికి గల కారణాలపై తక్షణ సమాచారం లేదు. విమానాశ్రయం నుండి అన్ని టేకాఫ్‌లు, ల్యాండింగ్‌లు నిలిపివేయబడ్డాయి. ప్రాంతం చట్టూ ఉన్న హెలికాప్టర్లు సంఘటనా స్థలం వద్దకు వెళ్లాయి.
రెస్క్యూ ఎయిర్ బోట్‌లు విమానాశ్రయానికి ఉత్తరంగా ఉన్న జార్జ్ వాషింగ్టన్ పార్క్‌వే వెంబడి ఒక పాయింట్ నుండి పోటోమాక్ నదిలోకి పంపారు. ఢీకొన్న ప్రదేశానికి సమీపంలో ఉన్న ప్రాంతాన్ని ప్రకాశవంతం చేయడానికి తీరం నుండి లైట్ టవర్‌లను ఏర్పాటు చేశారు. కనీసం అరడజను పడవలు సెర్చ్ లైట్లను ఉపయోగించి నీటిలో సెర్చి ఆపరేషన్ చేస్తున్నాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఎయిర్ క్రాష్ రాత్రి 9 గంటల ప్రాంతంలో సంభవించింది.
కాన్సాస్ నుండి బయలుదేరిన ప్రాంతీయ జెట్, విమానాశ్రయ రన్‌వే వద్దకు చేరుకునే సమయంలో శిక్షణా సైనిక హెలికాప్టర్‌ను ఢీకొట్టింది. ఇది వైట్ హౌస్ కు దక్షిణంగా మూడు మైళ్ల దూరంలో ఉన్న ప్రపంచంలో అత్యంత కఠినంగా నియంత్రణ ఉన్న గగనతలంలో సంభవించింది. అమెరికన్ ఆర్మీ హెలికాప్టర్ వర్జీనియాలోని ఫోర్ట్ బెల్వోయిర్‌లో ఉన్న UH-60 బ్లాక్‌హాక్ కు సంబంధించినది. హెలికాప్టర్‌లో ముగ్గురు సైనికులతో కూడిన సిబ్బంది ఉన్నారని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. హెలికాప్టర్ శిక్షణ విమానంలో ఉంది.