తెలుగు సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రతి అభిమాని మొక్కలు నాటాలని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబా ప్రిన్స్ పిలుపునిచ్చారు.
సోమవారం ప్రిన్స్ మహేష్ బాబు 46వ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి మహేష్ బాబు కు బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వాలని బాబా ప్రిన్స్ అన్నారు.
సూపర్ స్టార్, ఘట్టమనేని మహేష్ బాబు పిలుపు మేరకు అందరూ మొక్కలు నాటాలని ఆయన అన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతా ఘట్టమనేని సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు అందరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని బాబా ప్రిన్స్ అన్నారు.
మొక్కలు నాటి మహేష్ బాబు కు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలని ఆయన అన్నారు.