39.2 C
Hyderabad
April 25, 2024 17: 06 PM
Slider ఆదిలాబాద్

పర్యావణ పరిరక్షణకై మొక్కలను నాటుదాం

#Nirmal SP

భావితరాల వారికి స్వచ్చమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరు  మొక్కలను నాటడం తమ వంతు భాధ్యతగా  భావించాలని నిర్మల్ జిల్లా ఎస్పీ సి. శశిధర్ రాజు అన్నారు. 6వ హారితహారాన్ని పురస్కరించుకోని నిర్మల్ జిల్లా కార్యాలయంలో, సాయుధ దళ కార్యాలయం ఆవరణలో ఎస్పీ మొక్కలను నాటారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో మొక్కలు నాటాలని చెప్పారు. మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందడంతో పాటు పర్యావరణ  కాలుష్యం తగ్గి మానవాళి మనుగడలో కీలకపాత్ర వహిస్తాయని చెప్పారు.

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత

భావితరాల వారికి స్వచ్చమైన పర్యావరణాన్ని అందించేందుకుగాను ప్రతి ఒక్కరు  మొక్కలను నాటడం తమ వంతు భాధ్యతగా గుర్తించాల్సిన అవసరం వుందని అన్నారు. ప్రతి ఒక్కరు  పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం రోజూన మొక్కలను నాటడం, మొక్కలను బహుమతిగా  అందజేయడం ఒక ఆనవాయితీగా మార్చుకోవాలని ఆయన కోరారు. మొక్కల రక్షణకు తగిన చర్యలను తీసుకోవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, సీఐలు జాన్ దివాకర్, జీవన్ రెడ్డి, రమేష్ బాబు, ఆర్ఐలు వెంకటి, కృష్ణయజేనేయులు, ఎస్పీ వెంకటరమణ, యంటిఓ వినోద్, ఎస్ఐలు మరియు ఎస్బీ సిబ్బంది, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పాలమూరులో ఆయిల్ పామ్ పెంపకానికి ప్రోత్సాహం

Satyam NEWS

కంకిపాడులో గ్యాస్ సిలెండర్ పేలి దంపతులు సీరియస్

Satyam NEWS

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఏ.ఎస్.రావు నగర్ సొసైటీ

Satyam NEWS

Leave a Comment