28.2 C
Hyderabad
April 20, 2024 13: 26 PM
Slider నిజామాబాద్

రిక్వెస్టు టు ఆల్: లాక్ డౌన్ కు అందరూ సహకరించాలి

bichkunda 25

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ప్రకటించిన తెలంగాణ లాక్ డౌన్ కు గ్రామస్తులు సహకరించాలని ఫతలాపూర్ సర్పంచ్ అరుణ్ కుమార్ కోరారు. బుధవారం బిచ్కుంద మండలం లోని ఫతలాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో  హైదరాబాద్ నుండి వచ్చిన 10 మంది  యువకుల పేరు నమోదు చేసి కరోనా వైరస్ లక్షణాలు ఏమైనా ఉన్నాయ అని ఏఎన్ ఏమ్ సంగీత పరీక్షించారు.

వ్యక్తి గత శుభ్రతే శ్రీరామ రక్ష అని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఎప్పటికప్పుడు సబ్బుతో చేతులను శుభ్ర పరుచుకోవాలన్నారు. కళ్లు ముక్కు నోటిని తమ చేతులతో తాకరాదని ఇతరులను కూడా కరచలనం చేయరాదన్నారు.

గొంతులో నొప్పి దగ్గు శ్వాస ఆడకపోవడం లాంటివి ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు రోడ్డుపైకి రాకుండా కట్టడి చేసి గ్రామ ప్రజలను ఎప్పటి కప్పుడు కరోనా వ్యాధి బారినపడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చైతన్య పరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సర్ఫరాజ్ ఉప సర్పంచ్ సంగప్ప రైతు సహకార సంఘం ఉపాధ్యక్షులు యాదు ఉన్నారు.

Related posts

గుడ్ మూవ్: మహిళా పోలీసులకు అదనపు సౌకర్యాలు

Satyam NEWS

మోసం చేసిన వైసీపీ నేతలకు ఇక గుడ్ బై

Satyam NEWS

జైలా? బెయిలా?: సీబీఐ కోర్టు ఆదేశాలపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ

Satyam NEWS

Leave a Comment