38.2 C
Hyderabad
April 25, 2024 14: 01 PM
Slider గుంటూరు

రిక్వెస్టు: శ్రీరామనవమి వేడుక అంటూ రోడ్లపైకి రావద్దు

CI Krishnaiah

కరోన వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని దేవాలయాలు,చర్చీలు, మసీదులు మూసివేసినందున మతపరమైన కార్యక్రమాలను బహిరంగ ప్రదేశాలలో జరుపుకోవద్దని గుంటూరు జిల్లా నరసరావుపేట టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య కోరారు.

గత రెండు రోజులు గా కరోన పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని, ఈ సమయంలో బయటకు వస్తే వాటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఎవరి మనోభావాలు ఇబ్బంది పెట్టాలని కాదు. ఎవరు బయటకు రావద్దు. ఉగాది రోజు కూడా గుంపులు గుంపులుగా బయటకు వచ్చారు.

శ్రీరామనవమి వేడుకలు మీ ఇళ్ళల్లో మీరే చేసుకోండి అని ఆయన అన్నారు. ఎవరు బయటకు వచ్చి పానకం, వడపప్పు, వంటి ప్రసాదాలు పంపిణీ చేయవద్దు అని ఆయన కోరారు. లాక్ డౌన్ నేపథ్యం అందరూ ఇంట్లో ఉండి లాక్ డౌన్ పాటించండి ఇది మీకూ దేశానికి కూడా మంచిది అని ఆయన అన్నారు.

దయచేసి బయటకు రావద్దు, కరోన వైరస్ బారిన పడొద్దు ఇది మీ అందరికి నమస్కరించి చెబుతున్నాను అని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్ ఆదేశానుసారం ఇది తప్పని సరిగా పాటించాలని ఆయన కోరారు. ఎవరు బయటకు వచ్చి వేడుకలు నిర్వహించవద్దని కోరారు.

Related posts

మతి తప్పి మాట్లాడుతున్న ఇమ్రాన్

Satyam NEWS

ఎల్ రమణ తండ్రి గంగారాం మృతి

Bhavani

నారా, పెద్దిరెడ్డి ఆధిపత్య పోరులో విజేత ఎవరు ?

Satyam NEWS

Leave a Comment