38.2 C
Hyderabad
April 25, 2024 12: 36 PM
Slider విజయనగరం

హుదూద్ ఇల్లుకు కరెంట్ నీరు సౌకర్యం కల్పించాలని

#hoodhood houses

పీపీఎస్ఎస్ జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్

హుదూద్ ఇల్లు కి రెండేళ్లుగా కరెంట్.. మంచినీరు.. సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించా లని ఏపీలో ని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో ని లంకాపట్టణంలో హుదూద్ ఇళ్ళ వద్ధ నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా శంకరరావు మాట్లాడుతూ పై విధంగా అన్నారు.

జగనన్న ఇల్లు ప్రభుత్వం ఉచితంగా కట్టి ఇస్తామని చెప్పి లబ్ధి దారుల వద్ద హామీ పత్రాలు తీసుకున్న ప్రభుత్వం నేటికీ కట్టలేదు. సరికదా ఇప్పుడు మీరేకట్టుకొండి లక్ష.80 చెల్లిస్తామని చెప్పి చేతులు ధులుపు కుందని. కట్టక పోతే పట్టా తిరిగి ఇచ్చేయాలని లేదంటే రేషన్ కార్డు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వమే జగనన్న ఇల్లు కట్టి ఇవ్వాలని విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు.

ఈమేరకు  కన పాక . గొడగలవీధి. గంజిపేట ఏరియాల్లో సమావేశాలు నిర్వహించారు. అలాగే టిట్ కో ఇల్లు లబ్ధి దారులు వద్ధ లక్షరూపాయలు కట్టించుకుని నాలుగేళ్లు అయింది నేటికీ ఇల్లుఅప్పజెప్పలేదు మరోవైపు అప్పు కి వడ్డీ కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ప్రభుత్వం కట్టిన సారిపల్లి వద్ధ 2200, సోనియా నగర్ లో 1200 ఇల్లు పూర్తయినా లబ్ధి దారులకు అప్పజెప్ప కుండా నేడు మరో 3 లక్షలు కట్ట మంటూన్నారని ఇది అన్యాయమని విజయనగర పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షులు పి. రమణమ్మ. ఉపాధ్యక్షులు జగదాంబ..సీఐటీయూ నగర అధ్యక్షుడు బి. రమణ తది తరులు పాల్గొన్నారు.

Related posts

‘యశోద’ ఎవరో తెలుసు కదా…

Bhavani

మేడారం మినీ జాతరలో సెల్ ఫోన్ దొంగల చేతివాటం

Satyam NEWS

పునర్నవి-రాహుల్‌ల మధ్య సంథింగ్‌ సంథింగ్‌

Satyam NEWS

Leave a Comment