35.2 C
Hyderabad
April 24, 2024 14: 19 PM
Slider శ్రీకాకుళం

భయం గుప్పిట్లో సమగ్ర శిక్ష ఆరోగ్య బోధకులు

Education 111

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది రోజులుగా ప్రభుత్వ పాఠశాలలో సమగ్ర శిక్ష లో పని చేస్తున్న ఆరోగ్య బోధకులకు  కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కాయగూరలు, మాంసం చేపలు మార్కెట్లలో సామాజిక దూరం పాటించేలా చేసే బాధ్యతను అప్పగించారు.

ఉదయం ఆరు నుంచి 11 గంటలు వరకు మార్కెట్ కు వచ్చిన కొనుగోలుదారులకు వీరు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. విద్యాశాఖ ఉత్తర్వుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో శాశ్వతంగా పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులకు మాత్రమే విధులు అప్పగించాలని ఉంది.

అయితే జిల్లా విద్యాశాఖ అధికారులు అనధికారికంగా సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న తాత్కాలిక ఆరోగ్య బోధకులకు బెదిరించి, భయపెట్టి మార్కెట్లలో అనధికారికంగా విధులను నిర్వర్తించాలని అధికారులు హుకుం జారీ చేశారు. ఎవరైనా తమ ఆదేశాలు పాటించకపోతే జీతం ఇవ్వమని, రాబోయే విద్య సంవత్సరానికి ఉద్యోగాలు రెన్యువల్ చేయమని బెదిరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఎలాంటి రక్షణ పరికరాలు కూడా ఇవ్వడం లేదు. నిన్న విశాఖపట్టణంలో పాయకరావుపేట మండలంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి అతని పిల్లలకు , అతని కుటుంబ సభ్యుల్లో కొంత మందికి కరోనా వ్యాధి బారిన పడ్డారు. దాంతో అందరూ భయపడిపోతున్నారు.

Related posts

బీడి కార్మికులకు ఇండ్ల స్థలాల కేటాయింపు

Satyam NEWS

విద్యుత్ చార్జీల పెంపును ఉపసంహరించుకోండి

Sub Editor 2

కాపీ క్యాట్: 2 వేల నోటుపై సెక్యూరిటీ ఫీచర్లు డొల్లే

Satyam NEWS

Leave a Comment