28.7 C
Hyderabad
April 20, 2024 03: 54 AM
Slider నల్గొండ

RMP వైద్యుల సమస్యలు పరిష్కరించాలి

#RMPDoctors

కమ్యూనిటీ పారామెడికల్C శిక్షణ తరగతులు పునః ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని హుజూర్ నగర్  నియోజకవర్గ RMP వైద్యుల సంఘం అధ్యక్షుడు షేక్ మన్సూర్ అలీ కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్  నియోజకవర్గం కేంద్రంలోని ఏరియా వైద్యశాలకు వచ్చిన సూర్యాపేట జిల్లా  DCHS (జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి)డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు కు RMP వైద్యులతో కలిసి ఆయన వినతి పత్రం అందచేశారు.

హుజూర్ నగర్ ఏరియా వైద్యశాల నోడల్ అధికారి  డాక్టర్ ఎన్ రవికుమార్ కు కూడా సమస్యలు వివరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో  ఆర్ఎంపీ, పీఎంపీ, గ్రామీణ వైద్యులు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కరోనా వైరస్ గురించి వివరించి వారిని జాగృతం చేశామని తెలిపారు.

ఆర్ఎంపీ సంఘం ఆధ్వర్యంలో హుజూర్ నగర్ లో  పేద ప్రజలకు  మాస్కులు, సానిటైజర్లు, గ్లౌజులు,సబ్బులు పంపిణీ చేసి కరోనా వైరస్ సోకకుండా  జాగ్రత్తలను వివరించామని, ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు కరోనా సమయంలో తమ వంతు సహాయ సహకారాలు అంచామని, కరోనా నియంత్రణలో భాగస్వాములమైనామని అన్నారు.

కరోనా నియంత్రణలో భాగస్వాములమైన   ఆర్ఎంపీ, పీఎంపీ, గ్రామీణ వైద్యుల సేవలు  విస్మరించటం ప్రభుత్వానికి తగదని,  వారి సేవలను ప్రభుత్వం గుర్తించే విధంగా  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి  నివేదించాలని కోరారు.

RMP,PMP లు సమాజంలో అనేక అవమానాలకు గురి అవుతూ ఆవేదన చెందుతున్నారని  తెలిపారు.

ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల ఆర్ఎంపీ సంఘం అధ్యక్షుడు ఇనుగుర్తి  సత్యనారాయణ,సన్నిధి వెంకటేశ్వర్లు,షేక్ ఖాసీం, కొండా శ్రీను,షేక్ అమీనా,పి.బ్రహ్మం,ఎం ఆదినారాయణ,ఏ శ్రీనివాస్,ఖాజామోయినొద్దీన్  తదితరులు పాల్గొన్నారు.

బాచిమంచి చంద్రశేఖర్, సత్యం న్యూస్

Related posts

అమ్మకాలలో నూతన రికార్డులను సృష్టించిన సోనాలికా

Satyam NEWS

బిచ్కుంద మైనార్టి గురుకుల విద్యార్థులకు అస్వస్థత

Satyam NEWS

మా రోడ్లు దారుణం… ఒక్క సారి వచ్చి చూడండి నితిన్ జీ

Satyam NEWS

Leave a Comment