37.2 C
Hyderabad
April 19, 2024 12: 51 PM
Slider ప్రత్యేకం

దీపాలు వెలిగించే కార్యక్రమం వెనుక లాజిక్ ఏమిటి?

modi light

కాకతాళీయమో కావాలని చేశారో కానీ ప్రధాని మోడీ కరోనా పై పోరాటంలో ఇచ్చిన మరో పిలుపు తొమ్మిది అంకె చుట్టూనే తిరుగుతూ ఉంది. ఈ నెల 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించమని నేడు ప్రధాని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ నిర్ణయంపై  ఎటు నుంచి చూసినా 9 అంకెతో ముడిపడి ఉన్న అంశాలే కనిపిస్తున్నాయి. ఈ అంశం ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నది. ఇప్పటికే కొందరు జ్యోతిష్కులు తమ తమ పాండిత్యాన్ని ప్రదర్శించారు. ఇప్పుడు సంఖ్యా శాస్త్రం ప్రకారం కూడా కొందరు కొత్త భష్యం చెబుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ నేడు సరిగ్గా ఉదయం 9 గంటలకు ఈ పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగం సరిగ్గా 9 నిమిషాల పాటు మాత్రమే సాగింది. దీపాలు వెలిగించాల్సిన రోజు- నాలుగో నెల (ఏప్రిల్) ఐదవ తారీకు అంటే ఇది కూడా తొమ్మిదే. రాత్రి 9 గంటలకు, 9 నిమిషాల పాటు దీపం వెలిగించండి అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. నేడు దేశ వ్యాప్త లాక్ డౌన్ ప్రకటించి 9వ రోజు. ఏప్రిల్ 5 నాటికి మరో 9 రోజుల లాక్ డౌన్ పిరియడ్ మిగిలి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్స్ (మంగళ గ్రహం) కు చెందిన సంఖ్య 9. అగ్ని, కాంతి కలిస్తే మార్స్. అందుకే నేమో ఆ గ్రహానికి సంబంధించిన శక్తిని ఆహ్వానించేందుకు నరేంద్రమోడీ ఈ ప్రయోగం చేస్తున్నారేమో.

Related posts

మిస్ అయిన యువతి నేడు శవమై కనిపించింది

Satyam NEWS

32వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రతిజ్ఞ

Satyam NEWS

బహుభాషా భారీ బడ్జెట్ చిత్రం సేవాదాస్ సెన్సార్ పూర్తి!!

Satyam NEWS

Leave a Comment