36.2 C
Hyderabad
April 23, 2024 19: 19 PM
Slider ప్రత్యేకం

ఎమోషనల్ మూమెంట్: మోడీ మీరే మా పాలిట దేవుడు

pm modi

“దేవుడి రూపం మీలో చూశాను. చాలా చాలా థాంక్స్ సర్. మీ ఆశీస్సుల కారణంగా ఇప్పుడు నేను మంచిగా ఉన్నాను, మాట్లాడగలుగుతున్నాను ” ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి డెహ్రాడూన్ కు చెందిన ఒక మహిళ అన్నమాటలు ఇవి. డెహ్రాడూన్ కు చెందిన దీపా షా 2011లో పక్షవాతానికి గురయ్యారు.

నెలకు 5 వేల రూపాయలు మందులకు ఖర్చు చేయాల్సి వచ్చింది. చికిత్స చేయించడం, మందులు కొనడం చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఆమె భర్త వికలాంగుడు. అందువల్ల ఇది మరింత భారం అయింది. ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితుల్లో నరేంద్ర మోడీ జన్ ఔషది కేంద్రాలు తెరిచారు.

“జన్ ఔధి దుకాణాలు వచ్చిన తర్వాత ఔషధాల ఖరీదు తగ్గిపోయింది. ఇంతకు ముందు నెలకు కేవలం మందుల కోసమే రూ. 5,000 ఖర్చు పెట్టాను, ఇప్పుడు రూ. 1,500 మాత్రమే ఖర్చు సరిపోతున్నది. మిగిలిన రూ. 3,000 నేను నా ఇంటికి ఉపయోగపడింది’’ అని దీపా షా చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు.

అందుకే ఆమె మోడీలో దేవుడిని చూస్తున్నారు. మార్చి 7 ను జన్ ఔషదీ దినోత్సవంగా జరుపుకుంటున్న సమయంలో మోడీ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దీపా షా ఈ మాటలు చెప్పడంతో ప్రధాని నరేంద్రమోడీ భావోద్వేగానికి గురయ్యారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ఉండగా, డెహ్రాడూన్ కు చెందిన ఈ మహిళ తన అనుభవాన్ని చెప్పారు. దేశవ్యాప్తంగా 6,000 పైగా జన్ ఔషదీ కేంద్రాలు ఉండగా, ఒక కోటి కుటుంబాలు దుకాణాలు నుంచి చౌకగా లభించే ఔషధాల ద్వారా లబ్ధి పొందుతున్నాయని, ఈ విషయాన్ని ఆమె తన అనుభవాన్ని చెప్పారు.

భావోద్వేగానికి గురి అయిన మోడీ  కొద్ది క్షణాల పాటు మౌనంగా ఉండిపోయి తర్వాత మాట్లాడారు. దేశవ్యాప్తంగా జన్ ఔషదీ కేంద్రాల వల్ల కోటి పైగా కుటుంబాలు చౌకగా దొరికే మందుల వల్ల లాభ పడ్డారని అన్నారు. జన్ ఔషధీ కేంద్రాలతో రూ. 2,000 కోట్లకు పైగా ప్రజలు ఆదా చేశారని ఆయన అన్నారు.

Related posts

ఏపి ప్రజలకు జగనన్న రిటర్న్ గిఫ్ట్ ఆస్తి పన్ను పెంపు

Satyam NEWS

ఏలూరులో మిత్రపక్షాల మధ్య విభేదాలకు తెర

Satyam NEWS

లింగగిరి శ్రీ సీతారామ దేవాలయ భూమి కౌలు వేలం ఖరారు

Satyam NEWS

Leave a Comment