34.2 C
Hyderabad
April 19, 2024 22: 42 PM
Slider ప్రపంచం

రిషి సునక్ తో ప్రధాని మోదీ భేటీ

ఇండోనేషియాలో ఈరోజు ప్రారంభమైన జి-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం బాలి చేరుకున్నారు. ఈ సదస్సులో పలు దేశాల అధినేతలు పాల్గొన్నారు. ఈ సమయంలో, ప్రధాని మోడీ 20 కి పైగా సమావేశాలలో పాల్గొంటారు. ఇందులో ఆహారం, భద్రత, ఇంధనం, ఉక్రెయిన్ సంక్షోభం వంటి అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. జి-20 సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య చాలాసేపు చర్చలు జరిగాయి.

సునక్ ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించిన విషయం తెలిసిందే. జి-20 శిఖరాగ్ర సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ నెదర్లాండ్స్‌ ప్రధాని మార్క్‌ రూట్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా, బహుపాక్షిక శిఖరాగ్ర సమావేశాలు విభిన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడానికి ప్రపంచ నాయకులకు అద్భుతమైన అవకాశాలు అని ఆయన అన్నారు.

Related posts

లయన్స్ క్లబ్ ములుగు ఆధ్వర్యంలో విద్యార్థులకు టై బెల్ట్ బ్యాడ్జీలు పంపిణీ

Satyam NEWS

కబడ్డీలో ద్వితీయ స్థానంలో నిలిచిన గోపన్నపాలెం మహిళా జట్టు

Satyam NEWS

థియేటర్లలో ఆగస్టు 6 న క్షీరసాగర మథనం విడుదల

Satyam NEWS

Leave a Comment