Slider జాతీయం

అంబానీ పెళ్లి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ

#ambani

అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ‘శుభ్ ఆశీర్వాద్’ వేడుకలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు సందడి చేసారు. ప్రపంచ కుబేరుడు ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం రాధికా మర్చంట్‌తో అట్టహాసంగా శుక్రవారం జరిగింది. దేశ విదేశాల నుంచి ఎందరో అతిరథ మహారథులు వీరి పెళ్లికి హాజరై దీవెనలు అందించారు. ఈరోజు శనివారం శుభ్ ఆశీర్వాద్ వేడుక జరిగింది. ఈ వేడుకకు కూడా సినీ, రాజకీయ, బిజినెస్ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ వేడుకకు ప్రధాని మోడీ హాజరయ్యారు. ముఖేష్ అంబానీ ఘనస్వాగతం పలికారు. అనంతరం ముఖేష్ అంబానీ తనతో పాటు ప్రధాని మోదీని ‘శుభ్ ఆశీర్వాద్’ కార్యక్రమం ప్రధాన వేదిక వద్దకు తీసుకెళ్లారు. ఈ వేదికపైకి చేరుకున్న ప్రధాని మోడీ… వివాహ బంధంతో ఒక్కటైన అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ దంపతులను ఆశీర్వదించారు. అంతకు ముందు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు హాజరయ్యారు. అంబానీ తో కాసేపు ముచ్చటించి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Related posts

ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా సీనియర్ జర్నలిస్ట్ వడ్డి ఓంప్రకాశ్

Satyam NEWS

వినాయక సాగర్ లో మౌలిక సదుపాయాలు కల్పించండి

Satyam NEWS

కొట్టుకుపోయిన తమ్మిలేరు తాత్కాలిక రహదారి

Satyam NEWS

Leave a Comment