32.2 C
Hyderabad
April 20, 2024 22: 09 PM
Slider ప్రత్యేకం

సెకండ్ వేవ్ ను ఎట్టిపరిస్థితుల్లో రానివ్వవద్దు

#NarendraModi

దేశంలో కరోనా సెకండ్ వేవ్‌ను అడ్డుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఆయన ఈ మేరకు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌ను కోరారు.

దీనికోసం నిర్ణ‌యాత్మ‌కంగా  అడుగులు వేయాల‌ని ముఖ్యమంత్రులకు ఆయన సూచించారు. దేశంలో కొవిడ్ మ‌హ‌మ్మారి మ‌రోసారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో బుధ‌వారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా కొవిడ్ క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లపై ఆయన సూచనలు ఇచ్చారు. రాష్ట్రాల అభ్య‌ర్థ‌న మేర‌కు 45 ఏళ్లు పైబ‌డిన వాళ్లంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వాల‌ని ఈ స‌మావేశంలో కేంద్ర‌ ఆరోగ్య శాఖ ప్ర‌తిపాదించింది.

ఇక క‌రోనాకు చెక్ పెట్ట‌డానికి మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని, భౌతిక దూరం నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని ఈ సంద‌ర్భంగా రాష్ట్రాల‌కు కేంద్రం సూచించింది.

జ‌నం గుమిగూడే అవ‌కాశం ఉన్న ఈవెంట్ల‌లో అద‌న‌పు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని కూడా స్ప‌ష్టం చేసింది. టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌మెంట్‌, వ్యాక్సినేష‌న్ ప‌క్రియ కొన‌సాగాల‌ని సూచించింది.

ఇక ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కూ 96 శాతం మంది కోలుకున్నార‌ని, చ‌నిపోయిన వారి సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఒక‌ట‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ చెప్పారు.

Related posts

క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు బీజేపీ టిక్కెట్

Satyam NEWS

కూలి అవసరమైన ప్రతి వారూ లేబర్ కార్డు పొందాలి

Satyam NEWS

ఉద్యోగం చేసే మహిళ గర్భవతి కావడం తప్పా?

Satyam NEWS

Leave a Comment