37.2 C
Hyderabad
March 28, 2024 20: 18 PM
Slider ప్రత్యేకం

గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రధాని చిత్రపటాలు ఏర్పాటు చేయాలి

#bjym

సొమ్ము కేంద్రం ఇస్తుంటే సోకు రాష్ట్రం చేసుకుంటున్నదని BJYM నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు మూలే భరత్ చంద్ర అన్నారు. గ్రామ పంచాయితీల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయిస్తూ అనేక సంస్కరణలు చేపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాన్ని అన్ని గ్రామ పంచాయితి కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

BJP జిల్లా అధ్యక్షులు, కొల్లాపూర్ అసెంబ్లీ ఇంఛార్జ్ ఎల్లేని సుధాకర్ రావు సూచన మేరకు  నేడు BJYM ఆధ్వర్యంలో కొల్లాపూర్ మండల ఎంపీడీఓ కార్యాలయ సూపరిండెంట్ కి ఇందుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా BJYM జిల్లా అధ్యక్షులు మూలే భరత్ చంద్ర మాట్లాడుతూ TRS పాలనలో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని, అభివృద్ధిని విస్మరించి భూకబ్జాలు, అవినీతి పైనే దృష్టి కేంద్రికరించారని ఎద్దేవా చేశారు.

నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అంత్యోదయ స్పూర్తితో గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో అనేక సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుందని తెలియజేశారు అందులో భాగంగా చాలా అభివృద్ధి,సంక్షేమ పథకాలు చేపడుతుంటే, TRS ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ఏమీ చేయకపోగా కేంద్రప్రభుత్వ పథకాలను వారి పథకాలుగా చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తున్నారని విమర్శించారు.

కనీసం ఏ ఒక్క గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రధానమంత్రి చిత్రపటం లేకపోవడాన్ని BJYM తీవ్రంగా ప్రతిఘటిస్తుందని తెలియజేశారు. వెంటనే ఎంపీడీఓ కార్యాలయంతో పాటు అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రధానమంత్రి చిత్రపటాలను ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగా నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సందు రమేష్, మండల అధ్యక్షులు సాయికృష్ణ గౌడ్, BJYM అసెంబ్లీ కన్వీనర్ పరుశురాం, పట్టణ అధ్యక్షులు మెంటే శివకృష్ణ యాదవ్, మండల ఉపాధ్యక్షులు భరత్ యాదవ్,అనకలి వెంకటేష్,పట్టణ ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ ఖాన్,మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జాతీయ రహదారిపై ప్రమాదంలో మహిళ మృతి

Satyam NEWS

ప్రతిపక్షాల ఆస్తులు కూల్చడమే పనిగా పెట్టుకున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

తెలంగాణలో ముగిసిన రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర

Satyam NEWS

Leave a Comment