38.2 C
Hyderabad
April 25, 2024 14: 36 PM
Slider నిజామాబాద్

నిజాంసాగర్ ప్రాజెక్టు సందర్శించిన శాసన సభాపతి

#PocharamSrinivasareddy

భగవంతుని దయతో ఈ సారి మంచి వర్షాలు కురిసి నిజాం సాగర్ ప్రాజెక్టు తొందరగా నిండిoదని, ఉమ్మడి జిల్లాలోని రైతులు సంతోషంతో రైతులు పంటలు సాగు చేసుకోవచ్చని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

కామారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ శోభ, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే తో కలిసి నిజాం సాగర్ ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గంగమ్మకు పూజలు చేసి నీటిలో తెప్ప వదిలారు. అనంతరం ప్రాజెక్ట్ నీటి నిల్వలను పరిశీలించారు.

నిజాం సాగర్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మొట్ట మొదటి సాగు నీటి ప్రాజక్టు అని, ఇటువంటి ప్రాజెక్టుకు కర్ణాటక రాష్ట్రంలో మంజీరా నదిపై సుమారు 40 ఆనకట్టలు నిర్మించారని అందుకే వరద తగ్గి నిజాం సాగర్ ప్రాజెక్టు నిండడం లేదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఈ సారి భగవంతుని దయతో మంచి వర్షాలు కురిసి నిజాం సాగర్ ప్రాజెక్ట్ నిండిందని  పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు 2016 సంవత్సరంలో నిండగా తిరిగి ఇప్పుడు నిండిoదన్నరు. మంచి వర్షాలు లేక ప్రాజెక్ట్ ప్రతి సంవత్సరము అక్టోబర్ నెలలో నిండుతుంది.

ఇటువంటి పరిస్తితి తలెత్తకుండా రానున్న రోజుల్లో కాళేశ్వరం జలాలు తీసుక వచ్చి నిజాం సాగర్ నింపుతామన్నరు. ఇందుకు సంబంధించి పనులు జరుగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం జలాలు నిజాం సాగర్ నింపడంతో రైతులు రెండు పంటలు వేసుకుని సంతోషంతో ఉండవచ్చాన్నారు.

ఇక రైతులు ఈ ఖరీఫ్ లో పండించిన పంటలు దళారులకు అమ్ముకోవద్దని, రాష్ట్ర వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రబీలో రైతులు పంటలు ఆలస్యంగా వేసుకోవడంతో కోత సమయంలో వడగళ్ళు పడి పంట నష్టం జరుగుతుందని,అందుకే తొందరగా సాగు చేసుకుని ముందుకు సాగాలన్నారు.

కార్యక్రమం లో జెడ్పి చైర్మన్ దాపేదర్ శోభ, ఎన్ డి సి సి బి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఎంపిపి పట్లోళ్ల జ్యోతి దుర్గ రెడ్డి, ఎస్ ఇ మురళి ధర్ రావు, ఇ ఇ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఇంజనీర్ దత్తేత్రయ్య, ఏ ఇ డి. శివప్రసాద్, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Related posts

సరెండర్:అసోంలో 644 మంది మిలిటెంట్ల లొంగుబాటు

Satyam NEWS

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తొలి రోజు పర్యటన షెడ్యూల్

Satyam NEWS

వ్యాక్సిన్ వేయించుకున్న వారికి వాట్స్ యాప్ ద్వారా సర్టిఫికెట్

Satyam NEWS

Leave a Comment