37.2 C
Hyderabad
April 19, 2024 13: 14 PM
Slider నిజామాబాద్

జై తెలంగాణ:తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి

#Pocharam Srinivasareddy

రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారనుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు చాకలి ఐలమ్మ, పోలీస్ కిష్టయ్య, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేశారు. హౌసింగ్ బోర్డు కాలనిలో గల అమర వీరుల స్తూపం వద్ద పుష్పగుచంతో శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

 ఈ సందర్బంగా స్పీకర్ మాట్లాడుతూ.. దశాబ్దాల పోరాటం అనంతరం సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. సాధించుకున్న తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మేటి రాష్ట్రంగా నిలదొక్కుకుందని చెప్పారు.

దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రులు మారినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. కానీ తెలంగాణలో ఎన్నికల ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా కల్యాణ లక్ష్మీ, రైతుబంధు, రైతు భీమా లాంటి గొప్ప పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

లక్ష 20 వేల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు కోటి ఎకరాలకు నిరందించే పనులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. 40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు. ఇంత జరుగుతున్నా విమర్శించే వాళ్ళు అక్కడక్కడ ఉంటారని, వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

ప్రజల అవసరాలను గుర్తించి పనిచేసేదే నిజమైన ప్రభుత్వమన్నారు. పరిపాలించే నాయకుని సమర్థతతోనే పాలన గాడిలో పడుతుందని, అలాంటి సమర్థత ఉన్న నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వాలు ప్రజలు ఒకటి కోరుకుంటే ఒకటి చేసేవని, నిధులు ఇచ్చినా పనులు జరిగేవి కాదన్నారు.

విదేశాల ద్వారా వచ్చిన వారి నుంచి కరోనా ప్రభాలుతుందని భావించి శాసన సభను రద్దు చేసి లాక్ డౌన్ విధించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల ప్రజలకు 12 కిలోల బియ్యం, 8.59 లక్షల మందికి 15 వందల నగదు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు.

త్వరలోనే కాళేశ్వరం నీళ్లు కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు రానున్నాయని, తద్వారా 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారనుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్ షిండే, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దఫెదర్ శోభ, జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి పాల్గొన్నారు.

Related posts

శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు

Satyam NEWS

శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థుల ప్రతిభకు జాతీయ గుర్తింపు

Satyam NEWS

పైడిత‌ల్లి జాత‌ర‌: సిరిమాను తిరిగే ప్రాంతాన్నిప‌రిశీలించిన‌ ఎస్పీ

Satyam NEWS

Leave a Comment