27.7 C
Hyderabad
April 24, 2024 10: 20 AM
Slider ముఖ్యంశాలు

నవంబర్ 26 నాటికి పోడు భూముల సర్వే పూర్తి

#someshkumar

పోడు భూ సమస్యలు, భూమి క్రమబద్ధీకరణ అంశాలను త్వరగా పరిష్కరించాలని  సీఎస్ సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి పోడు భూముల సర్వే, తెలంగాణ క్రీడ ప్రాంగణాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాల, జీఓ 58,59,76 , ధరణి టిఎం 33 మాడ్యుల్ తదితర అంశాల పై సమీక్షించారు. సిఎస్ సోమేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పోడు భూముల సర్వే దాదాపు పూర్తయిందని, ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయిన గ్రామాలలో గ్రామసభ నిర్వహణ పూర్తి చేయాలని , నవంబర్ 26 నాటికి పోడు భూములకు సంబంధించి క్షేత్ర స్థాయి సర్వే, గ్రామ సభలు , ఎస్.డి.ఎల్.సి ప్రక్రియ పూర్తి చేయాలని  సూచించారు. పోడు భూముల సర్వే అంశంపై జిల్లాల వారీగా సిఎస్ సమీక్షించారు. అంతరం తెలంగాణ క్రీడ ప్రాంగణాల ఏర్పాటు సంబంధించి గ్రామీణ ప్రాంతాలు,  పట్టణాలలో అనువైన స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో 5 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని, జిల్లాలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సదరు ఫోటోలను యాప్ లో అప్ లోడ్ చేయాలని సీఎస్ సూచించారు.రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించి భూ సేకరణ ప్రక్రియ లో భాగంగా చెల్లింపులు వేగవంతం చేయాలని కలెక్టర్ లకు  సూచించారు. అనంతరం సిఎస్ జీఓ 58,59,76 భూ క్రమబద్ధీకరణ అంశాలపై కలెక్టర్లతో చర్చించారు. జీఓ 58 కు సంబంధించి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయిందని,    జిల్లా కలెక్టర్ లు తమ లాగిన్ నుంచి సదరు దరఖాస్తుల పై తుది నిర్ణయం తీసుకోవాలని సీఎస్ పేర్కొన్నారు. జీఓ 58 పరిధిలో ఉచితంగా క్రమబద్దీకరణ జరుగుతుందని, జీఓ 59 కు సంబంధించి  కలెక్టర్ ఆమోదించిన   అనంతరం ప్రభుత్వ నిర్దేశిత నిర్ణిత రుసుము చెల్లించిన తరువాత క్రమబద్ధీకరణ పూర్తవుతుందని సీఎస్ పేర్కొన్నారు.

సింగరేణి భూముల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఉత్తర్వు సంఖ్య 76 విడుదల చేసిందని దీని ప్రకారం 35438 వచ్చాయని వాటిలో 26 వేల దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయిందని, పెండింగ్ దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేసి మార్గదర్శకాల ప్రకారం అర్హుల క్రమబద్ధీకరణ పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. ధరణి లో టీఎం 33 కింద 1.03 లక్షల దరఖాస్తులు వచ్చాయని,  ప్రస్తుతం 49 వేల   దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, దరఖాస్తు చేసే సమయంలో పొరపాట్లు వస్తే రివర్ట్ చేసే సౌలభ్యాన్ని  అధికారులకు అందించామని సీఎస్ తెలిపారు.  ధరణిలో మొత్తం వచ్చిన 11  లక్షల దరఖాస్తులో 56 వేలు పెండింగ్ ఉన్నాయని, వీటి పరిష్కారానికి కలెక్టర్లు చొరవ చూపాలని సీఎస్ ఆదేశించారు.

Related posts

దళిత బందు కోసం జరిగే ధర్నాను జయప్రదం చేయండి: కెవిపిఎస్

Satyam NEWS

రోడ్ టెర్రర్:గీసుకొండలో ముగ్గురు యువకుల మృతి

Satyam NEWS

తెలంగాణలో కరోనా ఉద్ధృతితో నేడు ఐదుగురి మృతి

Satyam NEWS

Leave a Comment