28.7 C
Hyderabad
April 20, 2024 10: 25 AM
Slider ఆదిలాబాద్

పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలి: సి పి ఎం

#cpijukkal

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలుఇవ్వాలి,ఏకకాలంలో రుణమాఫీ చెయ్యాలని కోరుతూ ఆదివారం కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ఖండే బాల్లూరు గ్రామం లో సి పి ఎం పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సి పి ఎం పార్టీ జిల్లా కమిటి సురేష్ గొండ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పోడు రైతులకు పట్టాలు ఇస్తామని చెప్పి సర్వే ల పేరు మీద దరఖాస్తు ల పేరుమీద కాలయాపన చెయ్యడం సరైంది కాదని ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు.

ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి గ్రామం లో చేపట్టిన జైంట్ సర్వే, సర్వే చేసిన విధంగా, దరఖాస్తు తీసుకున్న విధంగా, ఎఫ్ ఆర్ సి కమిటిలు వేసి నేటికీ పట్టాలు ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. కాని ఇప్పటికి పట్టాలు లేక పోడు రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారాని బ్యాంకు ద్వార పంటరుణాలు పొందెందుకు రైతులు బ్యాంకుల వెళితే రుణాలు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు సుముఖత చూపడం లేదని పట్ట పాసుబుక్ ఉంటేనే రుణలిస్తామని విరందరికి ధరణి పట్ట పాసుబుక్ లు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాలని పెండింగ్ లో ఉన్న రుణమాఫీ లను పూర్తిగా మాపి చెయ్యాలని పోడు రైతులకు అందరికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని ప్రతి పోడు రైతులకు పట్టాలు ఇవ్వకపోతే వచ్చే నెల పిబ్రవరి మొదటి వారం లో జుక్కల్ చౌరస్తా లోని జాతీయ రహదారి దిగ్బoదం చెయ్యడానికి సి పి ఎం పార్టీ పిలుపు నివ్వడం జరుగుతుందని పిబ్రవరి వరకు పట్టాలు ఇవ్వని పక్షం లో జాతీయ రహదారి ని దిగ్బo ధం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో మోతిరం నాయక్, మాజి ఎంపి టి సి కె. రాములు, జుక్కల్ మండల అధ్యక్షుడు బి. ఆడేప్ప, ఆహేమద్, సి హెచ్ హుస్సేన్న, మహిబూబ్ సబ్, బంగార్పల్లి విట్టల్, కోలా నారాయణ తో పాటు పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

1xbet официальный Сайт 1xbet Зеркало Казино И Регистрация В Бк

Bhavani

విశాఖ స్టీల్ ప్రైవేటీక‌ర‌ణ గురించి…బీజేపీ ఎంపీ జీవీఎల్ ఏమ‌న్నారంటే..?

Satyam NEWS

తెలంగాణలో బాణసంచా నిషేధం

Sub Editor

Leave a Comment