37.2 C
Hyderabad
April 19, 2024 12: 12 PM
Slider ముఖ్యంశాలు

కవి ఎండ్లూరి సుధాకర్ కన్నుమూత

#endlurisudhakar

ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్ కన్నుమూశారు.  శుక్రవారం తెల్లవారు జామున ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 62 ఏళ్లు. ఎండ్లూరి సుధాకర్ మృతితో తెలుగు సాహిత్య ప్రపంచం విషాద సముద్రంలో మునిగిపోయింది. ఎండ్లూరి సుధాకర్ నిజామాబాద్ లో 1959 జనవరి 21వ తేదీన జన్మించారు. ఆయన తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేసారు. కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడిగా, తెలుగు సలహా మండలి సభ్యుడిగా, తెలుగు అకాడమీ సభ్యుడిగా కూడా ఆయన ఉన్నారు. ప్రసిద్ధమైన హిందీ, ఉర్దూ పద్యాలను తెలుగులోకి అనువదించారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఆయన డాక్టరేట్ పొందారు. ఎండ్లూరి సుధాకర్ ను పలు అవార్డులు అందించాయి. 1992లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు ఆయనను వరించింది. కవికోకిల జాషువా పురస్కరాన్ని అందుకున్నారు. ఎండ్లూరి సుధాకర్ మృతితో దళిత సాహిత్యం మాత్రమే కాకుండా తెలుగు సాహిత్యం అత్యంత విలువైన సాహితీవేత్తను కోల్పోయింది.

Related posts

బీజేపీ లోపాల పాలన వల్లే పెరిగిన పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు

Satyam NEWS

ప్రశాంత డెల్టా ప్రాంతంలో వైసీపీ దాడులు

Satyam NEWS

మహా శివరాత్రి కోసం కోటప్పకొండకు ప్రత్యేక బస్సులు

Satyam NEWS

Leave a Comment