34.2 C
Hyderabad
April 19, 2024 18: 58 PM
Slider సినిమా

Movie Review: మాస్ ను తృప్తి పరిచే ఎంటర్ టైనర్ ‘‘పొగరు’’

#PogaruTelugu

కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ చిత్రాలకు తెలుగులో ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. దీనితో  ధృవ సర్జా, రష్మిక మందన్న జంటగా నటించిన కన్నడ చిత్రం ‘పొగరు’. నందన్‌కిషోర్‌ ఈ సినిమాకు దర్శకుడు.

ఈ చిత్రాన్ని సాయిసూర్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై డి. ప్రతాప్‌రాజు తెలుగులో విడుదల చేసారు. ‘రొమాంటిక్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌’ గాఈ సినిమా తెరకెక్కింది. అర్జున్‌ జన్యా, చందన్‌శెట్టి. ఈ సినిమాకు సంగీతం అందిచారు.  ఈ సినిమాలోని ‘కరాబు మైండు కరాబు..’ అనే పాట సంచనం సృష్టించింది.

యూట్యూబ్ లోఈ పాటకు మిలియన్ల కొద్ది వ్యూస్ దక్కాయి. సినీ వర్గంలో అందరినీ ఆశ్చర్య పరుస్తూ పొగరు సినిమా కి ఏకంగా రూ. 3.7 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరగగా  ఇప్పుడు ఈ సినిమా రూ.4 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.

ఫిబ్రవరి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రూ. 25 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన పొగరు సినిమా ఎలా ఉందో తెలుసుకుందామా…

ఎవరెలా చేశారంటే…

సామాన్యులను ఇబ్బంది పెట్టే వారితో పోరాడే వ్యక్తిగా ధృవ సర్జా కనిపించాడు. ఈ సినిమాలో దృవ లుక్ ఉరమాస్ గా ఉంది. ఇక ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల కోసం ధృవ సర్జా ఏకంగా 30 కిలోల బరువు తగ్గాడట. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ లో ధృవ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించడు. ఆ షెడ్యూల్ పూర్తయిన వెంటనే మళ్ళీ భారీగా బరువు పెరిగాడట. రూ .25 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో  ముఖ్య పాత్రల్లో నటించారు.

సాంకేతికంగా:

సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ పనితనం బాగుంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. చందన్‌శెట్టి అందించిన సంగీతం అలరించింది. నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ తో పాటు లోకల్ లుక్స్, డైలాగ్ డెలివరీలతో కూడిన ధ్రువ సర్జా, మొత్తం సినిమాను సింగిల్ హ్యాండ్ తో నడిపించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు . మాస్ ఆడియన్స్ ఆకలితీర్చే సినిమా అని,  యాక్షన్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఫైనల్ గా

కమర్షియల్ అంశాలన్నీ నిండుగా ఉన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. సినిమాలో పాటలు, ఫైట్లు, డైలాగ్స్‌.. వేటికవే హైలెట్‌గా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. అంతర్జాతీయ బాడీ బిల్డర్లు నలుగురు నటించి ఆ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూర్చారు. రష్మిక నటన యువతను ఆకట్టుకుంటుంది. మాస్ ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాంటి చిత్రం పొగరు.

నటులు : ధృవ సర్జా, రష్మిక మందన్న, ధనంజయ్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, పి రవిశంకర్, కై గ్రీన్, సాధు కోకిల, కుట్టి ప్రతాప్, మోర్గాన్ ఆస్టే తదితరులు.
సంగీతం :  చందన్‌శెట్టి
నిర్మాత : ప్రతాప్‌రాజు
దర్శకుడు : నందన్‌కిషోర్

Related posts

ఎక్కడి అభివృద్ధి అక్కడే.. ఇవేనా దశాబ్ది ఉత్సవాలు..?

Satyam NEWS

విద్యా శాఖ మంత్రిచే సత్కారం అందుకున్న మధుసూదన శర్మ

Satyam NEWS

విజయవాడ దుర్గగుడి ఈవో ఎంవీ సురేశ్‌ బాబు బదిలీ

Satyam NEWS

Leave a Comment