32.2 C
Hyderabad
June 4, 2023 18: 49 PM
Slider జాతీయం

POK కూడా జమ్ముకశ్మీర్‌లో భాగమే

AMITSHAH1

కశ్మీర్ లో ప్రజలు దశాబ్దాల తరబడి అన్యాయానికి గురవుతుంటే, ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ వారిని పట్టించుకోలేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. కశ్మీర్ లో ఉద్రిక్తతలకు కారణం కాంగ్రెస్ వైఖరేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ లోక్ సభలో జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా తనను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. ఇప్పటికే రాజ్యసభలో జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం పొందిందని, రాష్ట్రపతి కూడా బిల్లు పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారని తెలిపారు. లోక్ సభలో బిల్లు ఆమోదం పొందేందుకు విపక్ష పార్టీలు సహకరిస్తే.. ప్రజలు హర్షిస్తారని స్పష్టం చేశారు అమిత్ షా. ఈ బిల్లు అమలైతే కశ్మీర్ వాసులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. జమ్మూ కశ్మీర్ అంశంతో ఇతర దేశాలకు, ముఖ్యంగా పాకిస్తాన్ కు ఏ మాత్రం సంబంధం లేదని, ప్రస్తుతం పాక్ ఆక్రమిత ప్రాంతంగా ఉన్న కశ్మీర్ కూడా భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు.  పాకిస్తాన్ ఆ ప్రాంతం నుంచి వైదొలగాలని హితవు పలికారు అమిత్ షా.

Related posts

పన్నులు చెల్లించి గ్రామాభివృద్ధికి సహకరించండి

Satyam NEWS

పంట చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట

Satyam NEWS

ఆక్టోబర్ 24 వరకు 30 పోలీస్ యాక్ట్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!