రోజు రోజుకు పెరుగుతున్న గోదావరి వరద పోలవరం మండలాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక గిరిజన గ్రామాలను ముంచెత్తింది. గత 10 రోజులుగా అన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. గోదావరి వరద ఉదృతంగా ప్రవహించడంతో పోలవరం టూరిజం బోట్ పాయింట్ వద్ద వరద తాకిడికి రింగ్ బాండ్ పక్కన కోతకు గురైంది. గత రాత్రి అదే టూరిజం బోటు పాయింట్ వద్ద రెండు లాంచీలు గల్లంతైన సంగతి తెలిసిందే. 24 గంటలుగా కురుస్తున్న వర్షాలకు బోట్ పాయింట్ కొద్ది కొద్దిగా కోతకు గురౌతుంది లారీలతో రాయి తెప్పించి పోస్తున్నారు, కోతకు గురైన పది అడుగుల మేరకు గోదావరి నదిలో అడ్డుకట్ట వేసిన పెరుగుతున్న వరద తాకిడికి ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.