31.2 C
Hyderabad
April 19, 2024 04: 02 AM
Slider ఆంధ్రప్రదేశ్

పోలవరం రివర్స్ టెండరింగ్ గ్రాండ్ సక్సెస్‌

Polavaram-pic

పారదర్శకత, ఎక్కువ మందికి అవకాశాలు కల్పించడం, అవినీతి నిర్మూలన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానం తీసుకువచ్చింది. గతంలో పనిచేసిన సంస్ధలకు కూడా రివర్స్ టెండర్ల విధానంలో అనుమతిస్తామని కూడా ప్రభుత్వం తెలిపింది. ఈ విధానం కింద పోలవరం 65 ప్యాకేజీ పనులకు టెండర్లు పిలిచారు. నీటిపారుదలశాఖ 274.25 కోట్లకు టెండర్లు పిలిచింది. సెప్టెంబరు 18 వరకు బిడ్స్ స్వీకరించారు. రివర్స్ టెండరింగ్‌లో 6 ప్రఖ్యాత కంపెనీలు పాల్గొన్నాయి. టెండర్లు దాఖలు చేసిన వారిలో పటేల్‌ ఇంజనీరింగ్ లిమిటెడ్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా స్ట్రక్టర్ లిమిటెడ్, మాక్స్ ఇన్‌ఫ్రా, ఆఫ్‌కాన్స్ సహా 6 సంస్ధలు ఉన్నాయి. నేటి ఉదయం 11 గంటలకు బిడ్ తెరవగా 260.26 కోట్లకు ఎల్‌1 బిడ్‌ దాఖలు చేసినట్లు వెల్లడయింది. ఎల్‌1 బిడ్డర్ గా మాక్సా ఇన్‌ఫ్రా ఎంపిక అయింది. 15.6 శాతం తక్కువ మొత్తానికి మాక్స్ ఇన్‌ఫ్రా టెండర్ దాఖలు చేసింది. దీనివల్ల గత ప్రభుత్వం కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ఒప్పందంతో  పోల్చితే 58.53 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నది. రూ.290 కోట్ల నుంచి 231.46 కోట్లకు కాంట్రాక్ట్ విలువ తగ్గింది.

Related posts

వి ఎస్ యూ లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి

Bhavani

కాంగ్రెస్ పార్టీలో చేరిన  8 మంది కౌన్సిలర్లు

Satyam NEWS

వడదెబ్బకు గురై వ్యక్తి మృతి

Bhavani

Leave a Comment