27.7 C
Hyderabad
March 29, 2024 01: 44 AM
Slider ముఖ్యంశాలు

పోలవరం  ప్రాజెక్టు నిర్మాణం 2022 నాటికి పూర్తి

#PolavaramProject

ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ  పనులు  సంతృప్తికరంగా సాగుతున్నాయని డ్యాం డిజైన్  ప్యానల్ చైర్మన్  ఏ బి.  పాండ్యా  తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో 16వ  పోలవరం  ప్రాజెక్టు  డ్యాం డిజైన్  ప్యానల్ సమీక్ష  సమావేశాన్ని  నిర్వహించారు.

సమావేశానికి పోలవరం  ప్రాజెక్టు  డ్యాం డిజైన్  ప్యానల్  చైర్మన్ ఏ.బి.  పాండ్యా అధ్యక్షత వహించారు.  ఈ సందర్భంగా ఏ.బి. పాండ్యా మాట్లాడుతూ  పోలవరం ప్రాజెక్టు  48 గేట్లుకు గానూ  29 గేట్లు  అమరిక పూర్తయిందని, మిగిలిన గేట్లు అమరికపై  అధికారులకు  పలు సూచనలు చేశారు.  ఈ గేట్లు ప్రపంచంలోనే   అతి పెద్దవిగా  పేర్కొన్నారు.  పోలవరంలో  52 మీటర్ల ఎత్తున స్పిల్వే పిల్లర్ల నిర్మాణం  పూర్తి అయ్యింది.

స్పిల్ వే బ్రిడ్జి 1128 మీటర్లుకుగానూ  1105  పూర్తి చేయడం జరిగింది. 48 గేట్లకు గానూ 29 గేట్లు  బిగింపు పూర్తయింది. గేట్లకు హైడ్రాలిక్ సిలిండర్లు,పవర్ ప్యాక్ లు అమార్చే పనులు వేగవంతం సాగుతున్నాయని  తెలిపారు.

గెడ్డర్లు అమరిక నేటితో పూర్తయిందని   వివరించారు. అయిదు అంశాలపై సమావేశంలో  చర్చించారు.  వరదలు సమయంలో కోతకు గురైన ఎడమ గట్టు పరిరక్షణ చర్చకు వచ్చింది.  సమావేశంలో  పోలవరం ప్రాజెక్టు అధారిటీ సిఇఓ  చంద్రశేఖర్ అయ్యార్,  జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఇంజనీర్ ఇన్ ఛీఫ్  సి. నారాయణ రెడ్డి ,పోలవరం ప్రాజెక్ట్ ఎస్ ఈ నరసింహ మూర్తి, మేఘా ఇంజనీరింగ్ సంస్థ డైరెక్టర్ సి హెచ్ సుబ్బయ్య,జి ఎం సతీష్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం: ఉద్రిక్తత

Satyam NEWS

ప్రాబ్లెమ్:పాపాను ముట్టుకుంటేనే చర్మం ఊడుతుంది

Satyam NEWS

గ్రౌండ్ లెవెల్: డిగ్రీ కాలేజీ విద్యార్ధులకు వనదర్శిని

Satyam NEWS

Leave a Comment