35.2 C
Hyderabad
April 20, 2024 18: 26 PM
Slider విజయనగరం

మహా శివరాత్రి సందర్భంగా పటిష్ట బందోబస్తు…!

#depikaips

మూడు పుణ్య క్షేత్రాల వద్ద 4 గురు డీఎస్పీల ఆధ్వర్యంలో గట్టి నిఘా..!

ఉత్తరాంధ్ర లో మరీ ముఖ్యంగా విజయనగరం లో మరో ముఖ్యమైన పండగ రానే వచ్చింది. ఈ నెల 18 వ తేదీ మహా శివరాత్రి సందర్భంగా జిల్లా లోని రామతీర్థం, పుణ్యగిరి ,రాజాం వద్ద మరో పుణ్యక్షేత్రం లో శివరాత్రి సందర్భంగా పటిష్టమైన బందోబస్తు నిర్వహించేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నారు.

మహా శివరాత్రి సందర్భంగా ఈ నెల  18న రామతీర్ధం, పుణ్యగిరి మరియు సన్లాం (రాజాం) వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా పలు శివాలయాల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్ లు  మెయింటేయిన్ చేసేందుకు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

మహాశివరాత్రి సందర్భంగా విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల పిఎస్ పరిధిలోని రామతీర్ధం, ఎస్.కోట పిఎస్ పరిధిలోగల పుణ్యగిరి, రాజాం పిఎస్ పరిధిలోగల సన్లాంలోగల దేవాలయాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆయా దేవాలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు విధులు నిర్వహించేందుకు 700 మందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.

నదులు, కాలువలు, కోనేరు, సముద్ర స్థానాలు చేసే సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, జలాశయాల్లో మునిగి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జలాశయాలు వద్ద పుణ్య స్నానాలు చేసే సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసామన్నారు. ఆలయాల వద్ద ఏర్పాటు తాత్కాలికంగా పోలీసు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తున్నట్లు, ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినట్లయితే వారు వెంటనే పోలీసు కంట్రోల్ రూంను సంప్రదించి, పోలీసుల సహాయాన్ని పొందాలన్నారు.

పుణ్య స్నానాలు చేసే సమయంలోను, కొండలు ఎక్కే సమయంలోను, దైవ దర్శనాలకు వెళ్ళే సమయం లో మహిళలు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వారిని ఎట్టి పరిస్థితుల్లోను ఒంటరిగా విడిచిపెట్టవద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం. దీపిక విజ్ఞప్తి చేసారు. ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని, పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ అధికారులు, సిబ్బందితో సమన్వయంతో పని చేయాలన్నారు.

ప్రజలకు సూచనలు చేసేందుకు అవసరమైన చోట్ల పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ను వినియోగించాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. వీటితోపాటు జిల్లాలో పలు శివాలయాల వద్ద భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, దొంగతనాలు జరగకుండా బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

మహా శివరాత్రి సందర్భంగా 700 మందితో పోలీసు బందోబస్తు

మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని పలు దేవాలయాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సుమారు 700మందితో భద్రతా ఏర్పాట్లు చేసామని జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. విజయనగరం జిల్లా లో రామతీర్ధం (నెల్లిమర్ల), పుణ్యగిరి (ఎస్.కోట), సన్లాం (రాజాం) జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు 4గురు డిఎస్పీలు, 10మంది సిఐ, ఆర్ ఐలు, 45మంది ఎస్ఐలు ,ఆర్ఎస్ఐలు, 150మంది ఏఎస్ ఐలు,హెచ్సీలు, 140మంది కానిస్టేబుళ్ళు, 45మంది మహిళా కానిస్టేబుళ్ళు, 140మంది హెూంగార్డులు, 55 మంది ఎఆర్ కానిస్టేబుళ్ళు, 50మంది ఎస్టీఎఫ్ సిబ్బంది బందోబస్తు నిర్వహణలో పాల్గొననున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

శ్రీ‌లంక బోట్‌లో వంద కిలోల‌ హెరాయిన్ స్వాధీనం!

Sub Editor

గుంటూరులో కనకదుర్గమ్మ దేవాలయం కూల్చివేత

Satyam NEWS

దేశ కట్టుబాటుపై అల్ జజీరా విష ప్రచారం

Satyam NEWS

Leave a Comment