34.2 C
Hyderabad
April 23, 2024 11: 45 AM
Slider ప్రత్యేకం

24న కేటీఆర్ పర్యటనకు పకడ్బందీగా బందోబస్తు

#gadwalpolice

ఐటీ మరియు పురపాలక శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 24 వ తేదీన నారాయణపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు , ప్రారంభోత్సవాలు చేయడానికి వస్తున్న సందర్భంగా జోగులాంబ జోన్-VII  DIG LS. చౌహన్ ముందస్తు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేసి, బాధ్యతగా విధులు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

శనివారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకొన్న DIG కి జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారులు పుష్పగుచ్చలు అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా సాయుధ దళ పోలీసుల చేత గౌరవ వందనాన్ని స్వీకరించారు. తదుపరి ఎస్పీ కార్యాలయం పరిశీలించి, కాన్ఫరెన్స్ హాల్ లో పోలీస్ అధికారులతో VIP  బందోబస్తుకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి KTR పర్యటనకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని, ఇతర జిల్లాల నుండి పోలీసులు బందోబస్తుకు వస్తారని తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి పోలీసులు తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వర్తించాలని అధికారులకు సూచించారు. అనంతరం రూట్ మ్యాప్ ఆధారంగా హెలీప్యాడ్ ను, BRS పార్టీ అఫీస్, కలెక్టర్, ఎస్పీ కార్యాలయం స్థలాలను,ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్ నూతన సఖి సెంటర్, కొండారెడ్డి పల్లి చెరువు, మీటింగ్ ప్లేస్, సీనియర్ సిటిజన్ పార్క్ మొదలగు స్థలాలను పరిశీలించారు.

ట్రాఫిక్ డైవర్షన్, మీటింగ్ ప్లేస్ కి వస్తున్నా ప్రజల పార్కింగ్ కొరకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసులు అప్రమత్తంగా ఉండి బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి లు సత్యనారాయణ, వెంకటేశ్వర రావు, సిఐ లు రవి బాబు, శ్రీకాంత్ రెడ్డి, సీతయ్య, జనార్ధన్ RI లు రాఘవరావు కృష్ణయ్య డేవిడ్ విజయ్ కుమార్ SI లు  మొదలగు వారు ఉన్నారు.

Related posts

మాది పక్షపాత పేదల ప్రభుత్వం: డాక్టర్ గోపిరెడ్డి

Satyam NEWS

15 నిమిషాలు ఆలస్యమైనా ప్రాక్టికల్స్ కు అనుమతి

Sub Editor 2

తిరుపతిలో రౌడీ షీటర్ పై పగ తీర్చుకున్నారు

Satyam NEWS

Leave a Comment